పుట:శ్రీ సుందరకాండ.pdf/367

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 46

                  23
విడుమరలే కురవడి జడిగొను దు
ర్ధరుని శరాసారము నరికట్టెను,
వానరేంద్రు, డవసాన వర్షముల
కడమ మబ్బులను సుడిగాడుపువలె.
                  24
అటు లా దుర్దరు డనిలనసుతుని వా
లంపఱతో పీడింపగా, విసిగి, యెగసి,
ముల్లోకములును బొమ్మరపోవగ
బొబ్బలుపెట్టుచు పొంగి పెరిగె దివి.
                  25
వెంటనె మారుతి మింటను దూరము
మీదు మిక్కిలి క్రమించి, క్రమ్మఱి, ర
యమున దుర్ధరు రథముపై దుమికెను,
కొండమీద పిడుగుల రాశింబలె.
                  26
గుఱ్ఱము లెనిమిది కూలి క్రిందబడె,
ఇరుసుతునకలుగ విఱిగె రథంబున
కాడి యూడిపడె; కాలము తీరగ
నేలమీద కైవ్రాలె దుర్ధరుడు.
                  27
దుర్ధరుడాగతి తూలి త్రెళ్ళ, యూ
పాక్షుడును విరూపాక్షుడును కినిసి
అరిమర్దను లిద్దరును మహా రో
షముతో ఆకాశంబున కెగసిరి.
                 28
నిర్మలంబయిన నింగి నెగడి, త
మ్ముభయుల నెదిరిన యోధవానరు మ
హాభుజుని బలీయముగా మొత్తిరి,
గుండెలమీదను పిండిపిండిగా.

354