పుట:శ్రీ సుందరకాండ.pdf/366

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                 17
తన తేజోమయ ధామమాలికల
పొడుచుచున్న రవి పోలికను ప్రకా
శించుచున్న కపిశేఖరు, వీరా
కారము చూచిరి గండురక్కసులు.
                 18
దీర్ఘ బాహువులు, దీప్తోత్సావాము,
అతికాయంబు, మహాబలవేగము,
ఒడలు తాల్చినట్లుండెను మారుతి,
తోరణంబుపయి ధీరస్ఫూర్తిని.
                 19
హనుమను చూచినయంతనె తడయక
వా రందఱు నలువైపుల వలగొని,
ఒక్కుమ్మడి ఆయుధములతో, పై
బడి ప్రహరించిరి వానరవీరుని.
                 20
దుర్ధరుడను దైత్యుడొకడు పచ్చని
వా దరతేఱిన వాడి నా రసము
లయిదింటిని చయ్యన చాలుగ కపి
నడినెత్తినబడ నాటెను సూటిగ.
                 21
అయిదు బాణముల హనుమ మస్తకము
వ్రయ్యలై_ పగుల, వానరుడును బ్ర
హ్మాండ మదర బిట్టఱచుచు రయమున
కుప్పించి యెగసె ఉప్పరంబునకు.
                 22
అది గని దుర్ధరు డరదమెక్కి, వి
ల్లెక్కుపెట్టి, వడి లెక్కలేని వా
లంపఱ కురియుచు ఆభీలముగా,
హానుమమీది కెగయగ ఉంకించెను.

353