పుట:శ్రీ సుందరకాండ.pdf/365

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 46


                 ?
వారలలో నెవ్వరియందును పొడ
కట్టవయ్యె నీ కపి శార్ధూలుని
బాహుపరాక్రమ బలదీమసములు,
తీక్షణ భీమగతి ప్రహారములు.
                 ?
ఈతని నిశిత మనీషాధారయు,
రూపుమార్చు నేరుపును వారిలో
లే, విది పరిశీలించిన, వానరు
డొక దురంతపు ప్రయోగము కాదగు.
                 13
మీకు చాలరు త్రిలోకముల సురా
సురనరు లింద్రుడు జోడుకూడినను,
ఈ కపివృషభము నాకట్టుడు, ఎం
తటి మహాప్రయత్నముతోనైనను.
                 14
జయముకోరు రణనయకోవిదులకు,
ఆద్యవిధాయక మాత్మరక్షణము,
నిశ్చితంబు కానిది చంచలమగు
యుద్ధఫలిత, మది యోధు లెఱుగుదురు.
                 15
స్వామి పలుకు శాసనముగ గైకొని,
అగ్నులబోలిన అగ్రనాయకులు,
అతివేగంబున అరిగి ముట్టడిం
చిరి హనుమంతుని సింహసంహనుని.
                  16
మదము జిడ్డుగొను మాతంగంబులు,
కాలూదని మదకంఖాణంబులు,
భార రథంబులు, బహువిధ శస్త్రా
స్త్రంబుల రణసంరంభం బెగసెను.

352