పుట:శ్రీ సుందరకాండ.pdf/364

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


              5
యత్నంబున రవ్వంత యేమరక,
అడవి వానరుని అడచిపట్టదగు,
దేశకాలములతీరు లరసి, అవి
రోధముగా పని సాధింపం దగు
              6
స్థితిగతులు వివేచించిన నా కిది
సామాన్యపు కపిగా మది తోచదు,
సర్వజగద్బల శక్తి భూతమని
భావింతును అనుభవపూర్వంబుగ.
              7
సృజియింపందగు ఇంద్రుడు మనకై
తన తపమంతయు ధారబోసి, కా
దేని సురాసుర ఋషిపన్నగ య
క్షగణము లొకటై కల్పింపందగు.
               8
నాతో మీరందఱు కలసి సహక
రింప, వారి నెదిరించి జయించితి
మపు, డందు కవశ్య ప్రతికారము
నిపు డీగతి ఘటియింప నోపుదురు.
              9
సందేహము లేదిందుకు, మీరలు
చులకనచేయక చుట్టుముట్టి, బలి
మిని మెలకువతో మెలగి పట్టు డీ
ఘాతుక వానర భూతము నెట్టన.
             10-12
అతివిక్రమ విశ్రుతుల వాలిసు
గ్రీవుల, బలవరిష్ఠు జాంబవం
తుని, సేనాధిపతిని నీలుని, ద్వివి
దాదుల బీరము నరసితిని మునుపు.

351