పుట:శ్రీ సుందరకాండ.pdf/333

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 39


49
సింహంబుల వాసిని, బెబ్బులుల బ
లిమిని, మదగజేంద్రముల బీరమున,
విక్రమింత్రు కపివీరులు గోళ్ళును
కోరలు శరముల తీఱున క్రాలగ.
50
కొండలుబోలిన గండువానరులు,
మేఘంబులవలె మిఱుమిట్లొఱయగ,
గర్జించుచు, లంకా మలయాచల
సానువుల తిరుగుసందడి విందువు.
51
తల్లీ ! అతను నిదాఘపీడలను
సుఖమెఱుగక , ఉస్సురనుచు వేగును,
రాఘవు డంతర్ధాహ వేగమున ;
కేసరి బరి చిక్కిన మదకరివలె.
52
ఇక, శోకంబున నేడ్వ కనదవలె,
మనసున అప్రియమును శంకింపకు,
నీవును నాథునితో విహరింతువు,
దేవేంద్రునితో దేవి శచి పగిది.
53
రామునికన్న పరమ విశిష్టు డిల
కలడె ? ఎవరు లక్మణు సరివత్తురు ?
పవనపావక ప్రాయులు నీ కా
శ్రయులై యొప్పెడి రాజసోదరులు.
54
రాక్షస హింసా రౌద్రభూమియగు
లుకనుండ వీ వింక దీర్ఘముగ,
వచ్చు నీ విభుడు వైళమె, సైపుము,
పోయివత్తు కమలాయతలోచన.

320