పుట:శ్రీ సుందరకాండ.pdf/332

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


43
రావణేశ్వరుని రాక్షసగణముల
నాహవమున హతమార్చి సమూలము,
నిను కొనిపోవును నిజపురంబునకు,
శీఘ్రమె రఘుకుల శేఖరు డార్యా !
44
ఊఱటచెందుము, యోగకాలమును
కాంక్షింపుము, మంగళమగు, మైథిలి !
ఇంతలోనె వీక్షింతువు నీ విభు,
జ్వాలాభరణ కృశాను సమానుని.
45
ఈ దశకంఠుడు సోదర మిత్ర క
ళత్ర బాంధవ బలంబులతో తెగ,
కూడదు రామునితోడ నీవు, రో
హిణి చంద్రుని కూడిన కైవడి నిట.
46
కళ్యాణీ ! వేగమె నీ వీ ఖర
కష్టసముద్రము గట్టెక్కద, వతి
శీఘ్రముగనె చూచెదవు రామశర
కాండంబుల దశకంఠుడు తెగిపడ.
47
ఇటుల వైదేహిని ఓదాఱిచి
తిరిగిపోవు బుద్ధిని తమకించుచు
మారుతి, క్రమ్మఱ మైథిలి వైపున
చూచు చనియె నౌత్సుక్యముతో నిటు.
48
ఆత్మవిదుడు, రిపుహంత రాఘవుని,
చాపధరుని లక్మణకుమారునిన్ ,
లంకవాకిటి కెలంకుల చూతువు
అతిశీఘ్రముగా శతపత్రేక్షణ !

319