పుట:శ్రీ సుందరకాండ.pdf/331

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 38


37
ఏడుసముద్రము, లెనిమిది పర్వత
ములతో శోభిలు భూచక్రమును, ప్ర
దక్షిణించి రుత్సాహముతో పలు
మారులు మున్ను సమీర మార్గమున.
38
నాకంటెను మిన్నలును సమానులు,
కల రెందఱొ మా కుల విఖ్యాతులు
సుగ్రీవునికడ, సుముఖీ ! నాకం
టెను కనీయు డొకడును లేడచ్చట.
39
అధికుల నంపరు అన్నిపనులకు, క
నిష్ఠుడని నను పనిచి రీపనికయి,
కడలిదాటి నీ కడకు నేనె రా
గలిగితి, ఇక పెద్దల తలపెందుకు ?
40
విలపింపకు దేవీ ! నీ శోక త
పనలు శమించును, వానరసేనలు
ముమ్మరముగ దిగి మొగరించును లం
కావాసులు దిక్కా మొగములుగాన్ .
41
జోడుసింహముల పోడిమి మెఱసెడి
రామలక్ష్మణులు నా మూపురముల
మీదనె వచ్చి సమీపింతురు నిను;
పొడుచుచున్న సూర్యుడు చంద్రుడువలె.
42
నరవరేణ్యులు, రణభయంకరులగు,
రఘుకులవీరులు రామలక్మణులు,
కలిసివచ్చి లంకను పట్టి, వివిధ
సాయకముల నాశనము చేయుదురు.

318