పుట:శ్రీ సుందరకాండ.pdf/330

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


        31
అరికులాంతకుడు, ఆహవశూరుడు
రాఘవు డను క్షాత్రప్రఖ్యాతికి,
అనువుగ వీరవిహారము జరిగెడి
సమరవ్యూహము సమకూర్చుము హరి !
           32
హితకరములును సహేతుకములు నగు
జనకజ వాక్యములను గమనించి,ని
దానించి సమాధానముగా, ఇటు
పలికె నామెతో పవననందమడు.
             33
దేవి ! ప్రభువు సుగ్రీవుడు తన భ
ల్లూక వానర చమూకోటిని అం
కితము చేసె నీకై రాఘవునకు,
సర్వసత్వ బలసంపూర్ణు డతడు.
            34
వేలుకోట్లు కపివీరాగ్రేసరు,
లొక్క యుద్ధవిడి యుద్ధకాంక్షతో,
రాక్షసకుల మారణదీక్షను సు
గ్రీవువెంట దూకెదరు లంకలో.
            35
విక్రమ సాహస భీమబలాఢ్యులు,
మనసుతోనె రయమున వాలగలరు;
వానరభల్లుక సేనలు పతులును,
వత్తురు సుగ్రీవప్రభు నాజ్ఞను.
             36
మిఱ్ఱుపల్లములు, మెలికలు, తిరుగు,
ళ్ళడ్డగలే పా గడ్డు వానరుల,
అలవికాని కార్యములకు జంకరు,
అతి తేజోమయు లని మొన వారలు.

317