పుట:శ్రీ సుందరకాండ.pdf/329

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 39


                    25
వానర భల్లుకబలము కాని, రా
ఘవ సోదరులే కాని, తమంతట
దుష్పారంబగు తోయధి నెట్టుల
దాటివత్తు రీ యేటిగడ్డపయి.
                   26
వాయు సుపర్ణులు, పావని వీవును,
మువ్వురు మాత్రమె భూతకోటిలో
కలరు, మహాసాగరమును దాటగ
చాలిన లాఘవ జవసాహసికులు.
                   27
కనబడుచున్నది కండ్ల కట్టెదుట,
దాటరాని దీ యాటంకము, ఎటు
పరిహరింతు వీ వరసిన చెప్పుము,
కార్యదక్షుడవు కపివీరాగ్రణి !
                  28
ఈ కార్యము ఫలసాకల్యముగా
నిర్వహించుటకు నీవు సమర్థుడ
వరిమర్దన ! నీ యశము లోకముల
స్వీయబలోపార్జిత మూర్జితమగు.
                   29
నా కొఱకయి సైన్యములు కూర్చుకొని,
సత్యసమరమున దైత్యునోర్చి, విజ
యుండయి నాధు డయోధ్య కేగుట, య
శస్కరమగు నీ చరితకు నాకును.
                   30
ఈడులేని విలుకాడు రాఘవుడు,
బాణధార జడివాన కురిసి, లం
కను నీటగలిపి, ననుకొని పోవుట
అనుగుణమ్మగును అతని ఖ్యాతికి.

316