పుట:శ్రీ సుందరకాండ.pdf/328

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                   19
పయనము కట్టిన పావని వైపున
తిరితిరిగి వావిరి వీక్షింపుచు,
భర్తృస్నేహము, పల్లవింప మె
త్తని యెలుగున ఇట్లనెను జనకసుత.
                   20
ఇంచుక తడయగ ఇష్టమున్న నీ
వీ నికటంబున కానరాని కడ,
ఒక్కదినము శ్రమతక్క నిలిచి పో
వచ్చు, లేచి వఱువాతనె మారుతి !
                   21
చేసిన యేకించి దదృష్టమున నొ
తావక సాన్నిధ్యసుఖం బబ్బెను,
ఇంచుకంత లభియించె తెఱపి నా
తీవ్రదుఃఖ దుర్ధినముల నడుమను.
                    22
పోయిరమ్ము హరిపుంగవ ! క్రమ్మఱ;
నా ప్రాణము లందాక బొందిలో
ఉండునో లేదో ఊహింపగ లే
నది; దినగండము బ్రదుకీ చెఱలో,
                    23
నెమ్మి నెఱపి యిటు నీ వేగిన నిను
చూడని దుఃఖము పీడించును నను,
దుఃఖము విడిచినతోడనె పొడిచిన
దుఃఖము మిక్కిలి దుస్సహం బగును.
                    24
ఒక్క సంశయము కక్కసించు నను
కపికుంజర ! అక్కడ మీ బల మంతయు
కపులును భల్లూకము లంతియెగద,
సాయము రణమున చేయజాలినవి.

315