పుట:శ్రీ సుందరకాండ.pdf/327

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 39


                    13
సీత వాక్యములు చెవియొగ్గి వినిన
అనిలనందనుడు హనుమంతుండును,
శిరసున చేతులు చేర్చి వినయముగ
బదులు పలికె బరవసము దీటుకొన.
                   14
రాగల డిచటికి రాముడు శీఘ్రమె,
వానర భల్లుకసేనలు మునుకొన,
సమరంబున రాక్షసుల చంపి, నీ
శోకము చల్లార్చును శుభగాత్రీ !
                   15
రాముని బాణపరంపర కురియగ
త్రాణలు తప్పక రణరంగంబున
నిలబడగల యోధులు కనిపింపరు
నరులలో సురాసురులలో నయిన .
                   16
ఆని మొనయందున, అందును నీ కో
సము వచ్చిన యుద్ధమున, రాఘవుడు,
ఇంద్రునేని, దివసేంద్రునేని, యము
నేని, తుదకు సహియింప కెదుర్చును.
                   17
రత్నాకర సూత్రము మొలనూలగు,
క్షితిచక్రము శాసింపగలడు రా
ముం, డా విజయాభ్యుదయము సిద్ధిం
చును నీ మూలంబున తపస్వినీ !
                   18
అట్లు విహితముగ హనుమంతుడు ప
ల్కిన సుభాషితములను మెచ్చుకొనుచు,
జానకి క్రమ్మఱ సంభాషించెను
మనసులోని అలమట లురియాడగ.

314