పుట:శ్రీ సుందరకాండ.pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    5
సీత యట్లు యాచించి యూరకొన,
వల్లె యనుచు పావని, మహాబలుడు,
ప్రతినచేసి, తలవాల్చి వినతి,సీ
తకు ప్రణమిల్లి , కదలె ప్రయాణమై .
                   6
తిరుగు పయనమున తఱలిపోవు హను
మను చూచి మఱల మైథిలి యిట్లనె,
కనుల నశ్రు లుత్కటమై కంఠము
బంధింపగ రాల్పడిన యెలుంగున.
                   7
అడిగితి క్షేమంబని చెప్పుము, హరి !
కూడియున్న రఘుకుల నందనులకు,
సుగ్రీవునకును, సుహృదులకు, సచివ
వృద్ధుల, కఖల కపిప్రవరులకును.
                   8-9
ప్రాణము లుండగ పత్ని నుద్ధరిం
చెను ధర్మాత్ముడు శ్రీరాముండను
కీర్తి వెలయగా వర్తింపు మనుము;
నా దుఃఖము మాన్పగ నీవె తగుదు.
                   10-11
నిత్యము వదలక నీ వుత్సాహము
తొలక చెప్పు పలుకులు విని రాముని
మనసు నా వయిపు మఱలి, పౌరుషము
చూప నుత్సహించును నను పొందగ.
                    12
నీవు నాదు సందేశము చెప్పిన
రాఘవుడు విని పరాక్రమించి, త
ప్పక వీరవిధాయక తత్పరుడగు,
చక్కపడు సమస్తమును మహాకపి !

313