పుట:శ్రీ సుందరకాండ.pdf/325

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సుందరకాండ

సర్గ39


                    1
చేతి కిచ్చి మణి, సీత యిట్లనియె,
వానరవర  ! ఈ యానవాలు నే
నంపినదని తడయక నమ్మును ప్రా
ణేశుడు, రాఘవు డెఱుగు దీనికథ.
                   2
ఈ చూడామణి చూచినయంతనె
స్మరియించును మువ్వురను రాఘపుడు,
జననిని కౌసల్యను, నన్నును, జన
కుని దశరథ నృపతిని, విఖ్యాతుని.
                   3
ఎటు మొద లిడదగు నీ కార్యంబును,
పిదప నేమి కావింపవలయు, అది
ఉత్సాహముతో యోచింపుము, దా
నికి సమర్థుడవు, నీవె మనీషీ !
                   4
నా కష్టము లంత మగుట కెయ్యది
ఆవశ్యకమో భావింపుము మది,
అది సాధింపగ యత్నింపుము హరి!
కడముట్టింపుము కట్టిడి దుఃఖము.

312