పుట:శ్రీ సుందరకాండ.pdf/277

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 34


                    37
నిను స్మరించు; ధ్యానించు సదా రా
ఘవుడు తోడి లక్ష్మణ సుగ్రీవులు
వేదనపడ, జీవించియుంటి వే
పుణ్యమొ రక్కసిమూకల చిక్కియు.
                   38
ఇచ్చటనే నీ వీక్షింపగలవు,
రాముని బాహుపరాక్రమధాముని
లక్ష్మణుతో, శతలక్ష కపిబలము
తో, సుగ్రీవునితో, వైదేహీ !
                   39
నేను సుగ్రీవుని ప్రియసచివుడ,
హనుమంతుం డను నను లోకంబులు,
లవణార్ణవమును లంఘించి, ప్రవే
శించితి లంకా శ్రీ నగరంబును
                   40
స్వీయ విక్రమము విశ్వసించి, దురి
తాత్ముడు రావణు నౌదలమీదను
అడుగుమోపి, యిక్కడికి వచ్చితిని
తావక శుభముఖ దర్శన దీక్షను.
                   41
నా రూపము గని, నా మాటలు విని,
దేవీ ! యేమే మీ వూహించితొ,
స్వస్తిచెప్పు మిక వాటికన్నిటికి,
గమనింపుము నమ్ముము నా పలుకులు.

264

28-4-1967