పుట:శ్రీ సుందరకాండ.pdf/276

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                   30
చారురూప వర్చస్సు భగుడు, కా
వలసినచోట అవక్రవిక్రముడు,
ఉత్తమజనముల నుత్తమోత్తముడు,
రథికులను మహారథికుడు రాముడు.
                  31-32
ఎవని ప్రాపున సుఖించు లోకములు,
అతనిని మృగమిష నవలలాగి, శూ
న్యాశ్రమమున నిన్నహరించె, నే
పాపి చూచు తన పాపము పండగ.
                  33
రఘువీరుం డచిరంబె రణంబున
రోషజ్వాలాభీషణంబులయి,
వేడిమి జడికొను వాడి తూపులను
పఱపి నెఱుపి రావణుని వధించును.
                  34
ఆ రాఘవు డిటు లంప దూతనయి
వచ్చినాడ నీ పజ్జ కు దేవీ !
తావక విరహాతపమున నాతడు
కృశియించుచు నీ కుశలం బడిగెను.
                  35
మహిత తేజస్వి, సహచరుడు, సుమి
త్రానందన వర్ధనుడు లక్ష్మణ కు
మారుడు నీకు నమస్కారంబులు
చేసి అడిగె నీ క్షేమము సాధ్వీ !
                  36
వాలి సోదరుడు, వానరేశ్వరుడు
రామచంద్రునకు ప్రాణసఖుడు, సు
గ్రీవుడు వీరచరిత్రుడు, ప్రాంజలి
పట్టి అడిగె నీ స్వస్థవృత్తమును.

263