పుట:శ్రీ సుందరకాండ.pdf/275

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 34


                    23
చిత్తమోహమో ! పిత్తవికారమొ !
వాతదోషమో ! భూతావేశమొ!
ఎండమావుల అకాండ తాండవమొ !
లేదా ! ఒక ఉన్మాద విశేషమొ.
                   24
ఉన్మాదము కానోప దీ అవిధి,
ఉన్మాదంబున కొక లక్షణమగు
మోహమొ ! కాదది, బుద్ధి కెఱుకపడు
నేననియు, ఎదుట వానర మనియును.
                   25-26
ఇటు పలుభంగుల ఇందువదన ఔ
నని కాదని మనసున తర్కించుచు,
రావణుడే యను భావము పయికొన,
హనుమతోడ మాటాడక నిలచెను.
                   27
సీత మనోనిశ్చితమును సుళువుగ
తెలియగజాలిన ధీమతి మారుతి,
పలుకసాగె మైథిలి కిష్టములయి
వీనుల కింపితమైన వాక్యములు.
                  28
సూర్యునివలె తేజోవిరాజితుడు,
శశివలె లోకోత్సవ కళామయుడు ,
రాజరాజు, వైశ్రవణ శ్రీనిధి,
ధీప్రకాశమున దేవ బృహస్పతి.
                  29
లోకసంస్తుత శ్లోకుడగు మహా .
విష్ణువు బోలును విక్రమపటిమల,
మధురభాషి, నిర్మల సత్యవ్రతి,
కీర్తిశాలి, లక్ష్మీ నిక్షేపము.

262