పుట:శ్రీ సుందరకాండ.pdf/274

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                     17
అనుచు శంక పైకొనగా పలికియు,
కాదని తోపగ వైదేహి, మఱల
హనుమతోడ నిట్లనె, నిను చూడగ
పాతరలాడును ప్రీతి నా మనసు.
                    18
రామచంద్రునకు రాయబారివై
వచ్చితివేని శుభంబు నీ కగును,
ఇక్ష్వాకుల కథ యిష్టము నా కిపు
డడిగెద చెప్పుము అతని వివరములు.
                   19
నా మనోహరుని రాముని సుగుణ గ
ణంబులు మిగుల ప్రియంబులు చెప్పుము,
నా చిత్తము వానర! హరించితి; న
దీజలవేగము తీరంబునుబలె.
                   20
ఎంత సుఖావహ మీ స్వప్న, మహో !
ఎంతకాలమాయె దశాస్యుడు నను
బలిమి పట్టికొనివచ్చి; కంటి ఇ
ప్పటికి రాఘవుడు పంపిన దూతను.
                   21
కలనై నను లక్ష్మణుతో రాముని
చూచిన బ్రతుకుదు శోక మణచుకొని,
ఏమి పాపమో యిది ! మచ్చరియై
స్వప్నము సైతము సాధించును నను.
                   22
కల కాదిది నిక్కము, కలలోపల
వానరములు కనబడిన శుభంబులు
కానేరవు; శుభకర మాయెను గద
నా కిపు డీ వానరుని దర్శనము.

261