పుట:శ్రీ సుందరకాండ.pdf/273

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 34


                    11
అని కళవళపడు చార్తి శోషిలి, అ
శోకశాఖను తదేకాశ్రయముగ
పట్టుకొన్న రఘువంశలక్ష్మి , అది
వదలిపెట్టి ధరపైన కూలబడె.
                   12
దుఃఖపీడనలు తూటాడగ, తన
వైపు చూడని సువాసిని నరయుచు,
దిగులు మిగులగా దీర్ఘ బాహువులు
రెండును చేరిచి దండము పెట్టెను.
                   13
సోలి భయంబున చూడనోడియును,
చేతులు జోడించిన వానరు గని,
బుసబుస నూర్పులు పుచ్చుచు వగపున
మైథిలి యిట్లనె బాధాస్వరమున,
                   14
మాయవేసములు వేయంగల మా
యావివి రాక్షస ! రావణుడవు నీ ;
వేల మఱల నన్నేడిపించెదవు,
ఖిన్నుల నేచుట క్షేమము కాదిల.
                   15
దండకాజనస్థానంబున మే
మున్నపు డీవొక సన్నాసివిగా,
కనబడితివి రాడసరూప మణచి,
నీవు కావె ఆ రావణుడ విపుడు.
                    16
ఉపవాసంబుల నుడికి కృశించుచు,
వీడని క్షోభల వేగుచున్న నను, :-
కామరూపివై కాటందగ వె
న్నాడెద విది నీ నాశనకాలము.

260