పుట:శ్రీ సుందరకాండ.pdf/177

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 18


శ్రీ

సుందరకాండ

సర్గ 18

                   1
పూచి అశోకతరువులు హసించు వని
పుష్పించిన తరువుల ఉద్యానము
తిలకించుచు, వైదేహి రాకకై
వేచుచుండె కపివృషభుడింతలో.
                   2
సాంగవేదములు చదివి, క్రతువులను
పచరింపంగల బ్రహ్మరాక్షసులు,
పలపల వేగిన వల్లెలు చెప్పెడి
వేదఘోష వినిపించె నంతటను.
                   3
వీనుల విందుగ వీధుల మ్రోగెడి
ప్రాతర్మంగళ వాదిత్రములను
ఆలకించుచున్‌. మేలుకొనె యథా
కాలంబున బలశాలి రావణుడు.
                   4
లేచినంతనె నిశాచరనాథుడు,
నలిగిన దువ్వలువలతో, తునిగిన
ఫూదండలతో, వేదురుపాటున
సీతనె చింతించెను స్మరియించెను.

166