పుట:శ్రీ సుందరకాండ.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 16


శ్రీ

సుందరకాండ

సర్గ 16

                  1
స్తవనీయను సీతను కొనియాడుచు
హరిపుంగవుడగు హనుమంతుండును,
తోడ్తో విదితాత్ముడు రఘురాముడు
తలపు తగుల చింతన్ బడె క్రమ్మఱ.
                   2
ధ్యాన స్తిమితుండయి ఒక నిమిషము
జానకి దురవస్థలు తలంచి, తే
జస్వి యయ్యు హరిసత్తముడు, మనో
వ్యధ లాపగలే కలమటించె నిటు.
                 3
గురువుల శిక్షుల పెరిగిన లక్ష్మణు
నకు మాన్యస్థానము, రామున క
ర్ధాంగి సీత; ఇటు లయ్యు దుఃఖమున
తపియించును, విధి దాటరానిదో !
                 4
రాముని శస్త్రాస్త్రముల ప్రభావము
లక్ష్మణు బాహుబల పరాక్రమములు
ఎఱిగినదగుట మృగేక్షణ క్రుంగదు ;
తొలకరించు ప్రొద్దుల గంగపగిది.

154