పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


    డలయగస్త్యాశ్రమఖ్యాత మాబూగిరి
         నేకలింగేశ్వరుం డిష్టదైవ
    మతి పావనము లయోధ్యా వల్లభీసీమ
         లాదికాలము నాఁటి యాటపట్టు
 
 గీ॥ లాశీలాదిత్య కనక సేనాది రాజ
   రాజపరమేశ రణ విహారప్రతిష్ఠ
   ఖండఖండాంత నగర విఖ్యాతి హేతు
   వట్టి మేవాణ్ణృపుల నెన్న నలవి యగునె.7

మ॥⁠ సమమైయొప్పు విశాలభైల శిఖరస్థానంబునన్ రాజపు
    త్రమహీకాంతకు వజ్రభూషణమటుల్ రాణించు చిత్తూరుసం
    ద్రము మధ్యంబునఁ గోడలేడు కొమరొందన్ బైకిఁగన్పట్టు దు
    ర్గమ లంకాపుర పూర్వవైభవము జోకల్ జ్ఞప్తికిన్ దెచ్చుచున్.8

గీ॥ ప్రక్కపక్కనఁ బదిబండ్లు వరుసగాఁగ
    సరుగ ననువైన వైశాల్య మతిశయిలఁగ
    నహిత దుర్భేదమగు గోడ లలరు కోట
    లేడుచుట్టు చిత్తూర్పురి కెసఁగియుండు.9

[1]సీ॥⁠ విపణిమార్గములతో వీధుల తుదినొప్పు
             శివకేశవాలయ శ్రేణితోడ
     నారామముల తోడ నపరంజి తాఁపిన
           సముదార భవనాంగణముల తోడ
     జతురంగముల తోడ నతి విశాలంబైన
               వివిధాయుధాగార వితతితోడ
    మణివితర్దికలతో మధుర నానాజాతి
               ఫలమహీరుహ కదంబకము తోడ
               
గీ॥ సౌధములతోడ, బహుసరస్సమితి తోడ
   రచ్చగమితోడ వారి యంత్రములతోడ
   భరత ఖండైక లక్ష్మీనివాస భూమి
   నగరమాత్రంబె చిత్తూరు నగర వరము.10
   

  1. Chittor is within the grasp of no foe, nor can the vassals of its chief know
    the sentiments of fear. Its towers of defence are planted on the rock nor can their
    nmates even in sleep know alarm. Its kotars are well filled and its reservoirs,
    fountains, and wells are overflowing. There are sighty four bazars many schools.
    for children and colleges for every kind of learning, many scribes of the Beedar
    tribe and the eighteen varieties of artisans. Of all, the Ghelote, is the sovereign,
    served by numerous troops both horse and foot and by all the thirty six tribes of
    Rajputs of which he is the ornament. Of all the royal abodes of India none could
    compete with Chittor before she became a widow... .. .. Near the temples are
    two reservoirs built of large blocks each one hundred and twenty five feet by fifty
    feet wide and fifty deep, said to have been excavated on the marriage of the “Ruby
    of Mewar" to Achil Keechie of Gogrown and filled with oil and ghee which were
    served out to the numerous attendants on that occasion.
    ‘‘ Tods’ Rajasthan Vol. II"