పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

నుండెనా యని ధర్మరాజు అర్జును నడిగిన ఘట్టములోని పద్యమువలె నున్నది.

శ్రీ నృపలోక జగద్గురుండు-మాయప్ప- ప్రతాపదేవుఁడు " ఇందు రసధ్వని వేయిమూర్తుల రూపు గట్టుచున్నది. హృదయము నుండి వచ్చిన భాష యనఁగానిది. వట్టి యక్షరములుగా మాటలుగా గనిపించును గాని ప్రతాపుఁడుగా మూర్తి గట్టిన పృద్వీసింహుని స్వాతంత్య్రాభిలాష యంతయు ధర్మ వీర రసమంతయు ఆమాటలలో నున్నది. ఇట్టి రచన మహా కవులే చేయఁగలరు.

ఆబ్దూరహిమాన్ వ్రాసిన యుత్తరము అతడు పృధ్వీసింహునితోఁ జేసిన సంభా షణ - ఆయుత్తరమును చదివితీరవలయును - అందులో కొన్ని భాగములు'

   "భరత ఖండంబు నుద్దరింపఁగ జనించు
    ధూర్జటివి నీవు రాజమాత్రుఁడవు గావు"
   "తనదు నేర్పిడి సంత హైందవ మహత్త్వ
    మక్బరంతయుఁగొను దొడ్డ యడితికాడు
   "స్త్రీలఁ బురుషుల రాజ్యంబు దేశమెల్ల
    విలుచు నీయక్బరను గొప్ప విలువకాఁడు
    
ప్రతాపుఁ డిట్టివాఁడు --- ఇంక అక్బరు ఇట్టివాఁడు.

    "ఈవు విశ్వప్రపంచమం దీశ్వరుని య
     నంత లీలాగతులు గొనియాడె దెపుడు"
     
    "విలువఁ గట్టుచు రాజ్యంబుఁ గొలుచు నక్బ
     రెవరి గొప్పతనం బెంతొ యెఱుఁగు జగము " "

ప్రతాపుఁడు మఱల యుద్ధమును ప్రారంభించెను. కొండలలో దాగి పొంచుచు పైబడుచు చీల్చుచు కలచుచు విటతాటనము చేయుచు త్రుటిలో చాటగుచు నిట్టి యుద్ధము చేసెను. (Guerilla warfare.) అయినను గెలువలేక పోయెను. ప్రతాపుని దారిద్య్రమున కంతు లేకపోయెను.