పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

చివర కిట్లనెను. "నారాజ్య మరణ్యము-మేము సన్న్యాసులము మీయక్బరు నకు మమ్ము గెలువవలెనని పట్టుదల ఏమి”

"అప్రతిహతముగా నక్బ రొక్కఁడె యేల క్షితిని దేవుఁడు సృష్టి చేయలేదు. ప్రజ లతనిచేఁ జంపబడటకుఁ బుట్టలేదు- రాజకన్యక అతని భోగ పరతకుద్దేశింపఁ బడగలేదు. అతని రాజ్యతృష్ణ ముందు సర్వజగత్తు “పారతంత్య్రయమున మునుఁగుటెల్ల పాడిగాదనుచు నక్సరెంత యెఱిఁగిన జగమున కంత మేలు" చివరకు భోజనవేళ మానసింహునకు గోపము వచ్చెను. నిష్ఠురోక్తు లాడెను. మిమ్ము నాశనము చేసెదనని చెప్పి లేచిపోయెను.

   ఇది యవనసేనతోఁ జేయు కదనమో స్వ
   జనముతోఁ జేయు కదనమో శంక గలిగె

ఈశంక ఆనాటినుండి ఈనాటివఱకు అట్లే యున్నది. ఈయుద్ధములో ప్రతాపుని సైన్యములు చెదరిపోయినవి. ప్రతాపుని తమ్ముడు సూక్తుడు ప్రతాపుడు అవతార పురుషుడని గ్రహించెను మఱల నన్నగారి వైపే చేరెను.

చివరకు తనబిడ్డ మోలుగడ్డితో చేసిన తినుచుండగా నడవిపిల్లి వచ్చి దానిని గీరి రొట్టె నెత్తుకొని పోయెను. ప్రతాపుఁడు చక్రవర్తి నాఱు నెలలు గడు వడిగెను ఉత్తరమిచ్చిభిల్లుని పంపెను ఆయుత్తరమును చూచి యక్బరు పొందిన సంతోషమునకు మితిలేదు. అక్బరు సభ లో పృధ్వీసింహుఁడు ఆ యుత్తరమును ప్రతాపుడు వ్రాయనే లేదనెను. వారును వీరును వివాదపడిరి. ఆయుత్తరము తెచ్చినభిల్లునితో పృధ్వీసింహుడును భార్యయు నిట్లనిరి.

"చెప్పుము చిత్తమిచ్చి యిదె శ్రీ నృపలోక జగద్గురుండు మాయప్ప ప్రతాపదేవుని ముఖాంబురుహంబున జంద్రబింబ మందొప్పెడి వెన్నెలట్లలరు నుత్తమమౌ దరహాసరేఖ తానెప్పటి యట్ల పాయక రహించుచు నున్నదె భిల్ల శేఖరా!

ఈపద్యము భాగవత పద్యమువలె నున్నది. కృష్ణుఁడు సుఖముగా