పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/138

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

101


   పుని వంకను దీనముగాఁ
   ద దృష్టులు పఱపె నాప్రతాపుం డంతన్. 73
   
క॥ గురుఁడనక దైవమన నె
   వ్వరినైనను దెగడు వీనిపై నభిమాన
   స్ఫురణము మాను; మెఱుంగవె
   యరసికులన్ బలుకరింప నగు ముప్పనుచున్. 74
   
ఈ॥ మలినమును జలముకైవడి
    నిల నలమిన పాపసమితి నింకించు రణం
    బు; లవశ్వము కరణీయం
    బులు నృపవంశమునఁ బుట్టు పురుషుల కెల్లన్. 75
    
క॥ ఏవేళ కేదివచ్చునొ
    యేవెరపునఁ బరిణమించు నెవరెఱుఁగఁగలా
    రీవేళ మమ్ముఁ గూఱిచి
    భావమునను నొవ్వ కనుచుఁబలుకుచు వెడలెన్. 76
    
-:సూక్తసింహ - ప్రతాపసింహు లొండొరు పోర యత్నించుట.:-


మ॥ "కమలాప్తాన్వయ మీదినం బపయశః కాలుష్యమున్ బొంది పూ
     ర్ణముగాఁగన్ జెడనున్న దీప్రళయమున్ దప్పింసఁగా నిప్డు మా
     ర్గి మొకం డున్నదె ఱెప్పపాటదను మీరన్ బోయినన్ వీరి దే
     హములున్ జేతికిఁ జిక్కునే యకట వ్రయ్యల్ వ్రయ్యలై రాలవే. 77
     
మ॥ అని యందుండిన వారలందఱును దుఃఖావేశ ధైన్యంబులన్
    గని శోషిల్లఁ బ్రతాపసూక్తులు శితోగ్రస్ఫార ఖడ్గంబులన్
    గొని వేగమ్ముగఁద్రిప్పు చొండొరుల నుగ్గున్ సూచమున్ జేయ ముం
    దున కొక్కుమ్మడి దూఁకి రేమనఁగనుండున్ మీది కార్యంబులున్.78
    
-:హరభట్టారకుఁడాత్మార్పణము గావించుట.:-

చ॥ మెఱుపు తటాలునన్ మెఱయుమెల్పున నాహరభట్టు తత్క్షణ
    స్ఫురిత మనోవికాసమునభూరి కృపాణము నెత్తి వక్షమున్
    బరియలుగాఁగఁ జీల్చుకొనివారల మధ్యను నేల వాచలుచున్
    బొరిపొరిఁ బ్రాణముల్ విడిచెముక్కున నోరను నెత్తురొల్కగన్ 79