పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

మెట్రిక్యులేషన్ వఱకూ చదివిన పాఠశాలలోనే అభ్యసించి వుండాలి. కీ॥ శే॥ గిడుగు రామమూర్తి పంతులుగారు నొక్క క్షణముకూడా వ్యర్థం చేయ కుండా జీవితాన్ని భాషకోసం వ్యయించిన నిష్కల్మష హృదయుడు. ఆయీ రాణాచరిత్రం ఆయన చూచివుంటే చాలా సంతోషించేవాడు. యెంతేనా వ్రాసేవాడు కూడాను. నాకు తెలిసినంతలో విమర్శించాను. యీనాటి ధన్య కవులలో యీయన చిటికెనవ్రేలి మీదికి వచ్చేవాడు గానీ అల్లా-టప్పావాడు కాడు.

శ్లో॥ కవిః కరోతి కావ్యాని లాలయత్యుత్తమో జనః
    తరుః ప్రసూతే పుష్పాణి మరుద్వహతి సౌరభం॥
    
మ॥ భగవంతుండగు రాజశేఖరుఁడు నీపట్లం గఁలాఁ డాంధ్రమం
    దగణేయంబగు కీర్తి నీఁగల ప్రతాపాధీశుచారిత్రమున్
    సొగసౌరీతి రచించి సత్కవుల మెచ్చుల్ హెచ్చుగాఁ గొంటి వెం
    తగ వర్ణింతును రాజశేఖర కవీ! ధన్యుండ వీ వన్నిఁటన్

∞♦∞♦∞♦∞♦∞♦∞♦∞

రాణా ప్రతాపసింహ చరిత్ర

విశ్వనాథ సత్యనారాయణ

"భారతము” దేశభక్తిని పెంపొందించునని రష్యను దేశస్థులు తమ భాషలోనికి అనువర్తించు కొనుచున్నారట. భారతమున కాశక్తి యున్నచో "రాణా ప్రతాపసింహ చరిత్ర”కును ఆశక్తి కలదు.

రాణాప్రతాపుఁడు పేరునకు రాజపుత్రుఁడు. ఆంధ్రుఁడు కాడు. ధర్మరాజాంధ్రుఁడా? కృష్ణు డాంధ్రుఁడా? రాముఁ డాంధ్రుఁడా? శంకరుఁ డాంధ్రుఁడా? వారందఱు భారతీయులు. అందుచేత ఆసేతుశీతనగము వారి కధలు పాడిరి. అట్లే ప్రతాపుఁడును.