పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/87

ఈ పుట ఆమోదించబడ్డది

38

ప్రబంధరాజవేంకటేశ్వర

గీ. మమిత సారస సారస కుముద నికర
   మధురసాసార మధురసా మధురసార
   భృంగసంగీత భంగీతరాంగితాభి
   లాగమంబు దలిర్చు చైత్రాగమంబు. 45

లయగ్రాహి. అంత ముదిత ప్రసవకుంతము విచిత్రసుల
                 తాంతము నిరస్తము నిశాంతము తరుశ్రీ
    మంతము గళన్మధు వసంతము పికోల్లసదు
                 దంతము ఘనర్తురసవంతము రసాలా
    క్రాంతము వీటీవృత వనాంతము హితానిల ని
                 శాంతము కనచ్ఛుకశకుంతము నికుంజో
    ద్భ్రాంతము కరాళికులకాంతల సమంచిత వ
                 సంతము తనంతన నిశాంతము చెలంగెన్. 46

ప్రాససీసము



సీ. ఔరగందపు మెట్టుదారిఁదారెడు పాఁప
                 కోరసోకిన సెకయూరుటకును
   తీరైన పాండ్యరాణ్ణారీకుచోదార
                 హారవళీయుక్త చారుగంధ
   సారపంకవిహార హారియై నిబిడ శృం
                 గారవనంబులఁ జేరి మీఱి
   సారస సారస సారసౌరభములు
                 చూరలు గొనుచు గర్పూరముల దు

గీ. మారములు దూఱి హిమవారి పూరమాని
   పేరెములుబాఱి మిగులగంభీరము గను
   సారెపురవీథి గడితేఱి స్వారిదిరుగు
   మేర నందందు మందసమీరణంబు. 47