పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/82

ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

33


ప్రకటఫలిత కదళీ జంబూముఖ | భాసురకోలము వేంకటశైలము
కవిదారిద్య్రోదద నామక భి | త్ఖర కుద్దాలము వేంకటశైలము
అతుల పురజన వృజిన ఘన హనన స | దాదిమకోలము వేంకటశైలము
పతిత యవనపుర లంకాపురహృ | త్పావని వాలము వేంకటశైలము
కాండ వికాండ తరీకృతసరసీ | ఘనశైవాలము వేంకటశైలము
తాండవ వేళోద్దండ లాసికో | క్త భరతతాళము వేంకటశైలము
జన భోజన దర్శన భయద సుద | ర్శన కరవాలము వేంకటశైలము
ఘనపులినా వృత దీర్ఘఝల్లరీ | కల్పితవాలము వేంకటశైలము
హరిదురువాసిత కుంకుమకస్తూ | ర్యతి జంబాలము వేంకటశైలము
పరిపరి విధములఁ బెనగొనియెడు పా | పంబుసరాళము వేంకటశైలము
మకరీ పత్రకనద్రామామమణి | మంజుసలీలము వేంకటశైలము
సకల జననికర భవహృద్ధి వ్యౌ | షది కత్తైలము వేంకటశైలము
చమరీవాలజ పవనృ రణిత వం | శ విలసదైవము వేంకటశైలము
అమర భ్రమరకచా గీత ప్ర | త్యారవ దైలము వేంకటశైలము
కాకోదరతతి పతినామ విశృం | ఖల కృత్కీలము వేంకటశైలము
లోకేశ్వర నిర్జరవరసన్నుత | లోలుపశైలము వేంకటశైలము
ప్రాభవ భవమృదు శైత్య మాంద్యసౌ | రభయుగ్వేలము వేంకటశైలము
వైభవహవ ధూమ శ్యామలతా | వాటి స్థూలము వేంకటశైలము
కందర బృంద రటన్నిర్ఘర లం | ఘన జంగాలము వేంకటశైలము
స్యందన కరి తురగ గరుడవాహన | సంభ్రమహేలము వేంకటశైలము
అతుల బహిర్ద్వార వితానక కృత | హాటక చేలము వేంకటశైలము
గతి సురభీకృతనైక దిగంతర | గంధ బిడాలము వేంకటశైలము
కమల భవాకర కలిత విహరణో | త్కంఠమరాళము వేంకటశైలము
అమిత మత పాషండ మదాప న | యన నారాళము వేంకటశైలము
పరవన తుందిల భద్రోన్నిద్రా | వనశార్దూలము వేంకటశైలము
గురుతర శాఖిశిఖోద్యద్రిం ఖ | ద్గోలాంగూలము వేంకటశైలము
సింధుర కందర సంఛన్నోప ల | శేఖర కూలము వేంకటశైలము
సైంధవ సింధుర చంద్రమణి విలా | స జననమూలము వేంకటశైలము
అనయ పుళింద పురందర నిర్మిత | హారి కుకూలము వేంకటశైలము
అనయము తపసుల కనుపును కజ్జా | యపు కండోలము వేంకటశైలము