vii
అని నిర్ణయించినారు. ఇందులకు ప్రబలకారణము కర్ణాటతుండీర మండలములలో క్రీ. శ. 1648-9నాటికి హిందూరాజ్యములు పోయి మహమ్మదీయ రాజ్యములు వచ్చినవి. ఈ యభిప్రాయమునే పూర్తిగా వెలిబుచ్చుచు శ్రీ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యములో(xiభా.పు165) క్రీ.శ. 1659నుండి1682 దాకా మధురరాజ్యాన్ని చొక్కనాథనాయకుఁడు పాలించేవాఁడు. అతనికి ముద్దుఅళగిరి అనే సవతి తమ్ముడు ఉండేవాడు ......వెంకటకవిని పోషించాడు". అని వ్రాసినారు. కాని వెంకటరమణయ్యగారు వ్రాసినట్లు క్రీ. శ. 1673 నాటికి ముద్దుఅళగిరి, చోళ మండలము నాక్రమించుకొన్నందునను వెంకటకవిని చోళ రాజులును పోషించి యుండినందున 1678 నాటికి ముందేయై యుండవలెను. ఆరుద్రగారి యభిప్రాయమును ఇదియే, "ఈ విద్యావతీ దండకం అంతకుముందు వ్రాసినదే అవుతుంది'-అని (చూ సమగ్రాం . xi పు 167).
2.కవియొక్క ఊరు - వంశము
గణపవరపు వేంకటకవి యొక్క తండ్రి అప్పయార్యుఁడు. తల్లి మంగమ్మ; నందవరీక శాఖకు చెందిన యమాత్యుఁడు. అలసాని పెద్దన తాళ్లపాకవారు మున్నగువారందఱు నందవరీకులే పెద్దన తండ్రి చొక్కయామాత్యుఁడు నియోగులలో ఆఱువేల ప్రాఙ్నాటి వారేగాక నందవరీకులు నుండిరి. కవి వసిష్ఠ గోత్రుఁడు. ఆశ్వలాయన సూత్రుఁడు. ఇతని యూరేదో తెలియదు. గణపవరము ఒకప్పుడు ఊరుగానుండి ఇంటి పేరుగా మాఱియుండును. అవతారిక 41వ పద్యములో 'కాటెపల్లీ ముఖ్య గణపవర గ్రామ శేఖర' అని చెప్పుకొన్నా డు. శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారు ఇట్లు వాసియున్నారు కాటెపల్లీ మజరా గ్రామమగు గణపవర మితని స్వగ్రామమని యేర్పడుచున్నది. ఈ గణపవర మెచ్చటనున్నదని విచారించగా నీమండలములో (నెల్లూరు) నుదయగిరి తాలూకా లో నున్నట్లును, నచ్చటఁ బూర్వము కవులెవ్వరో నుండినట్టు కొందఱు బట్రాజులు చెప్పెదరేగాని యిక్కవి యచ్చట జీవించియున్నట్టు వారు చెప్పుటఁగానము. ఇంతియగాక కొన్ని తాళపత్రప్రతులయందు ‘గామేపలి ముఖ్యగణపవర గ్రామ’ మని వ్రాసియున్న ది. ఆపక్షమునఁ గామేపలియనుగ్రామము అప్పకవి నివాస గ్రామమై యున్నది. ఇది మా మండలములోని కందుకూరు తాలూకాలోనిది. ఇందైనను నిక్కవివృత్తాంతముఁ జెప్పువారు లేరు వెండియు గోదావరి జిల్లా తణుకు వీరవాసరమునందు గణపవరమని యొక గ్రామమున్నదిగాని యచ్చటను