పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/75

ఈ పుట ఆమోదించబడ్డది

26

ప్రబంధరాజవేంకటేశ్వర

సీ. కొండలరాయనిఁ గొలుచు కవులకు బం
             గారంపు ముడుపు మోకాళ్ళముడుపు
    పరమదాసవ్రాత పాపంబులెల్లను
             గడలకుఁ దుడుపు మోకాళ్ళముడుపు
    దిటమున నెక్కు నెంతటివారి కొదవించుఁ
             గన్నంత ముడుపు మోకాళ్ళముడుపు
    నానాదిగాగత నరసంతతికిఁ బున
             ర్గమనంబు లుడుపు మోకాళ్ళముడుపు
గీ. తలుపు లిడనట్టి మేనులు విడుపుఁ జూపు
    నొడుపు మదినెంచి తపములు గడుపు మునుల
    పొడవు లెఱిగించు జీఁకటి నిడుపు గుహల
    కడు పొలుపలరు నిడుపు మోకాళ్ళముడుపు. 24

యతిభేదము


ఉ. స్వామి తమోపహారి కురు సారస సారస సారసారజా
    తామిత భంగ చారికి మదానవ దానవ దానవర్థిత
    శ్యామతనూ విహారి కళిజాలక జాలక జాలకాతి ద
    క్షాముల కైర వారిక విసార విసార విసార ధారికిన్. 25

క. హారి కిరి నేత్రపాలిత
   వారికి నిజదాస దురితవారణ రాజీ
   వారికి శ్రితకవిరాజికి
   వారికిఁ గోనేరి కతుల మగుసిరు లిడుచున్.26

సీ. వెలసి పూదేనెకాల్వల నిగుడ్చును రేపు
             నెత్తావి తెమ్మెరల్ నినుచు మాపు
    వలకారి దొమ్మితేఁటుల నల్గడల రేపు
             మరున కందిచ్చు ముత్తరము తూపు
    సంజీవనీ ముఖౌషధుల నెల్లెడఁ జూపుఁ
             బుణ్యంపుఁ బ్రోవకుఁ బూటకాపు
    శుకపికశారికా నికరంబులకుఁ బ్రాపు
             బడలిక లన్నియుఁ గడల ఛాపుఁ