పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/69

ఈ పుట ఆమోదించబడ్డది

{

20

ప్రబంధరాజవేంకటేశ్వర

పణవ దృతవిలంబిత లయగ్రాహి విహితోజ్జ్వల హరనర్తన వనమయూర మత్తకోకిల భ్రమరవిలసిత హంసశ్రేణి క్రేచఖచరప్లుత మనోజ్ఞంబై, మేదినీ జలధరమాలాకేతు మన్మహాస్రగ్ధర భాసురోత్తమాంగ భద్రక మత్తేభవిక్రీడితంబై, భూనుత విభూతికాంత వినయ కవిరాజితంబై, సింహరేఖోత్సాహ శరభ క్రీడా శార్దూలవిక్రీడిత ప్రహరణోత్సుక వీరవిలసిత మత్తాపరాజితేంద్ర శ్రీకుమారలలిత తురగ త్వరిత పదగతి బంధురంబై, మేఘవిస్ఫూర్జిత తరల విద్యున్మాలా సుకాంతి మానినీ మదనవిలసిత ప్రముదితవదన రతిప్రియకాంతంబై, చంద్రికానిశావిచిత్ర భుజంగప్రయాతంబై, ప్రగుణమృగనాభిశాలినీ మాలినీ భుజగవిజృంభిత వీణారచన మధురోద్గత గీతాలంబన మణిరంగచిత్రపదంబై, మదరేఖాలసగతి గజవిలసితాశ్వ లలితరథగమనమనోహరంబై, వంశపత్ర పతిత జలోద్ధతగతి కమఠవిలసిత హరిణీ కవికంఠభూషణ హంసరుత భ్రమరవిలసితక్ష్మాహార బింబపద్మ సుకేసరంబై, సింహోన్నత వరవక్త్ర పలాశదళ పృథివీభుజంగంబై, క్షమాలక్ష్మీకళాజిత ప్రతాప పద్మనాభ ప్రియంవదాష్టమూర్తియై, సర్వతోముఖమంగళ మంగళమహాశ్రీ కలితంబై, వృత్తరత్నాకరంబుంబలె నలరుచుండు వెండియు. 2

ఉ. జాతుల మించి పల్లవరసస్థితియున్ సుమనోవితాన వి
    ఖ్యాతి వహించి శాఖలం బ్రకాశమునొందు సుభాషితద్విజ
    వ్రాతముఁ గల్గి కాంచనపరంపరలన్ గణికా నికాయసం
    భూతవిలాసమున్ వెలయఁ బొల్చుఁ బురమ్ముఁ బురీవనమ్ములున్. 3

ఉపమాలంకారము



సీ. కమనీయ యంత్రతంత్రములచే విలసిల్లి
            సన్మార్గలంఘనసరణిఁ దనరి
   పైపూఁతవన్నియల్ పచరించి యంచిత
            మణిమాలికాస్ఫూర్తి గణనకెక్కి
   చిత్రాంశుక నిరూఢిచే సోయగము మించి
            పరిఖాప్తి నెంతయుఁ బరిఢవిల్లి
   జోకమీఱ భుజంగ లోకసంగతిఁ గాంచి
            ప్రద్యుమ్నలీలల రహి వహించి