పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/61

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

12

తే.గీ. జగతిఁ బాణిని లింగానుశాసనంబు
       రామకవి లింగనిర్ణయక్రమ మొకటిగఁ
       జేర్చి తెనుంగుఁగబ్బంబుఁ జేసితౌర
       గణపవరవార్థిచంద్ర ! వేంకటకవీంద్ర !

క. అతులిత విద్యానాథ
       ప్రతాపరుద్రీయ భాసుర రసమంజరులన్
       గృతులెంచ నాంధ్రకృతులుగ
       వితముగఁ జేసితివి సరస వేంకటసుకవీ!

సీ. అమరమునకు బదు లభినవాంధ్రఘనిఘంటుఁ
                           గౌముది కెన యాంధ్ర కౌముదియును
      [1] గణయతిప్రాసలక్షణ సీసమాలికఁ
                           నాంధ్ర ప్రయోగరత్నాకరంబు
       నిఖిల రేఫఱకార నిర్ణయ పద్దతి
                          షట్ప్రత్యయముల ప్రస్తారసరణి
        దగనిర్వదాఱుఛందములకు వచనంబు
                          సమధికాలంకారసారమను మ

గీ. హాకృతులు సేయ మా పేర నీకె జెల్లుఁ
        గాక వేఱకవులకునెట్లు గలుగఁ నేర్చు
        నౌర నీశక్తియెక్కడనైనఁ గలదె
        గణపవర మప్పనార్య వేంకటకవీంద్ర!

ప్రతిచరణ త్రి స్తబక యమ కైకనియమ భాసమాన సీసము

సీ. కవనమా భువనమా నవనమా నయహారి
                  నయహారి భయకారి జయము దయము
       లవనమా యవనమా నవనమా నలభాతి
                  నలభాతి కలరీతి నానుమేను
       భవనమా సవనమా న్యవనమా యవికాసి
                 యవికాసి పవిభాసి నదము మదము

  1. (గణనీయ సర్వలక్షణ శిరోరత్నంబు) అని పాఠాంతరము(పూ.రా)