పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/43

ఈ పుట ఆమోదించబడ్డది

xxxxii

అని ప్రయోగ మగుపడుచున్నది. మఱియు 688వ పద్యము ప్రాస భేదము వ్రాయఁబడియున్నది. ఈ ప్రాసభేదమున కప్పకవీయమున

32.తే. రలలు తమక్రిందనుండఁ బైగ్రాలు వ్రాలు
      ప్రాసవర్ణంబులై వానిఁ బాసియైన
      గూడియైనను బెఱయడుగులను నిలుచు
      **** **** ****

అని లక్షణము వ్రాయఁబడి యున్నదిగాన నీ గ్రంథమునందలి 638వ పద్యములోని నాల్గవపాదమగు 'నీ క్రియ సత్పుత్రకులు చరింతురుపుత్రా' అను ప్రాసమును సాధువని గ్రహించునది, వెండియు నిందు 781వ పద్యము ప్రాసభేదమని వ్రాయబడియున్నది. ఈ లకారశ్లిష్ట ప్రాసమునకు రాఘవపాండవీయ మునఁ బ్రయోగమగుపడుచున్నది. ఎద్దియనిన

33.శా. లోకత్రాణరతిం దదాదిమ మహీలోకప్రవేశోత్కథా
       షాకౢప్త ప్రథమ ద్వితీయపదగుం జన్మంజుమంజీర గ
       ర్ణాకల్పామల రామ భారతకథా సర్గంబుల న్మించు వా
       ల్మీకి వ్యాసులఁ గొల్చెదం దదుభయ శ్లేషార్థ సంసిద్ధికిన్.

అని ప్రయోగమగుపడుచున్నందున 781 వ పద్యమునందలి “నాకౢప్తకాంచుడంచును" అను నీ ప్రయోగము సాధువని గ్రహించునది.

(27) ఈ గ్రంథములోని 876వ పద్యము అష్టభాషా సీసము వ్రాయఁబడియున్నది. సంస్కృతము ప్రాకృతము శౌరసేవి, మాగధి, పైశాచి చూళిక, అపభ్రంశము, ఆంధ్రము ఇవి ఆష్టభాషలనఁబడును. వీనిలో సంస్కృతంబు ప్రకృతియనియుఁ బ్రాకృతంబు వికృతియని వ్యవహరింపఁబడుచున్నది. ఇందు భారతీదేవి శైశవభాషితంబు ప్రాకృతము నాఁబడు. ప్రాకృతంబు సౌరసేని మాగధి పైశాచి అపభ్రంశము అని ప్రాకృతంబు అయిదు విధములై నది. పైశాచియందు భేదమించుకంతగలిగి చూళికా పైశాచియన నొప్పె. ప్రాకృతాదులు చెడి తదృవములగుచు ననేకవిధములుగఁ దమలోఁ గలసి యుండుకతన నీ యాంధ్రం బేర్పడెగాఁబట్టి సంస్కృత ప్రాకృతాదులు