పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/32

ఈ పుట ఆమోదించబడ్డది

xxxi

21 చ. "కనుఁగొన ఱేకు లెన్మిదియుఁ
                    గర్ణిక చుట్టిడి స్రగ్ధరాంఘ్రుల
         న్మునుపటి యేడువర్ణములు
                    నుంగడ యేడుఁ బ్రవేశ నిర్గతు
         ల్పనుపడ నాల్గు దిగ్దళము .
                    లన్లిఖియించి విదిగ్ధళంబులం
         దెనయఁగఁ బాదమధ్యగము
                    లేడును వ్రాయఁగఁ బద్మబంధమౌ."

ఇందుకు సమమగు శ్లోకము సాహిత్యరత్నాకర వాఖ్యానమునందు నివ్విధముగ వ్రాయబడియున్నది.

     శ్లో. కర్ణికాది విభేద్వరాన్ క్రమాద్దిక్షు విదిక్షు చ
         సకర్ణికాంత్సప్తదిక్షు విదితక్షుతువికర్ణికాన్
         ప్రవేశ నిర్గమాఖ్యాంచ దిక్షుతేస్యు శ్చతుర్దశ
         వ్యవధానేన తానాద్యే దళేన్యత్రత్వనంతరాన్.

నరసభూపాలీయము దీనిని స్రగ్ధరావృత్తముతో వ్రాయవలయునని విధించినను కావ్య ప్రకాశికయందు నీ యష్టదళ పద్మ బంధము స్రగ్ధరావృత్తముతో వ్రాయఁబడక అనుష్టుప్ శ్లోకముతో నివ్విధముగ వ్రాయబడియున్నది. ఎట్లనగా

     శ్లో. “భాసతే ప్రతిభాసార | రసాఖాతా హతా విభా
         భావితాత్మ శుభావాదే | దేవా భావ తతేసభా”

సాహిత్యరత్నాకర ప్రతాపరుద్రీయముల యందు స్రగ్ధరలతోఁ గూర్చబడియే యున్నది,
 
     (d) ఇఁక సాహిత్యరత్నాకర వ్యాఖ్యానమందు నాగబంధ లక్షణము

     శ్లో. రేఖాభ్యాం చతురశ్రాణి చతుష్కోష్ఠాని కల్పయేత్
          రేఖా ద్వయాంతరాళే స్వాద్యథాకోష్ఠే గృహష్టకం
          విదిక్షు కుండలీకూర్వా త్తద్రేఖాగ్రైర్యథాక్రమం
          దిగ్రేఖాగ్రాణి బాహ్యాని యోజయే ద్దిక్త్రయేమిథః.

     శ్లో. ఏకత్రతు ఫణ పుచ్చమేళనం కల్పయే త్తథా
          అంతరాణ్యక్షయీ కుర్యాత్సం దంతాస్స్యుర్యథావిథః
          వర్ణావృత్తిస్థలాన్యత్ర కోష్ఠకోణాని షోడశ
          సందంశానాం చతుష్కంచ కంఠశ్చేత్యేకవింశతిః.