బ్రహ్మ, నారదీయ, మార్కండేయ, వామ, నాగ్నేయ, గారుడ, భవిష్య, ద్బాగవత, స్కాంద, మాత్స్య, లైంగ, కౌర్మ, వాయు, పాద్మ, వారాహ, బ్రహ్మకైవర్తాష్టాదశపురాణపారీణులైన మౌహూర్తికుల రావించి తద్వధూవరుల కానుకూల్యంబుగా నుభయబలవచ్ఛుభముహూర్తంబు నిశ్చయించి తత్కల్యాణమహోత్సవమునకు జిరతనూర శృంగారవనం బలంకారంబు గావించి దాను చిఱుత నూరక నొసంగం దలంచి చతురంగబలసమేతుండై తద్వనప్రాంతంబున కవిబుధగురుసేనామధ్యంబున కవిబుధగురుతారకానికరభాగంబున వెలుంగెడు రేవెలుంగు చందంబున నందంబుగా నున్న భాస్వరకార్తస్వరగిరిపరివృఢధీరుని నిజభుజప్రతాపదీపితసమరవీరోధీరుని హృదయముదయోదయపోషితాశేషధీరుని శరధిశరపరిహృతశరధీరుని పాలితనిరవధీరుని సర్వగీర్వాణక్రియమాణస్వస్వలోకసంత్రావిధీరుని ధీరుని కింకరీకృతవానరుని రక్షితనరుని నిరంతరగానకృద్గంధర్వకిన్నరుని భక్షితదావవైశ్వానరుని రైపమానాభిదానిదాననిశాతచక్రుని నిజకీర్తిపరిపూరితదిశాచక్రుని నూరీకృతతొండమాన్చక్రవర్త్యాది భక్తసాత్కృతవైభవుని అతులితప్రాభవుని మురాసురహరుని మైత్రీకృతహరుని డాలెచ్చ గండ్రగొడ్డంట బల్ చిక్కటారెక్కటిని నుక్కడంచి మించిన మందరాగధరుని యమందరాగంబునం గని యాసచే వెదకు దివ్యౌషధరాజంబు ముంగలం గనుపట్టిన తెఱంగున మదంగంబుఁ బావనంబు సేయ దీనులపాలిటి పెన్నిధివలె సన్నిధిం జేసితిరి కర్తుమకర్తుమన్యథాకర్తుమతిసమర్థులైన దేవరతిరువడిహళు గొలిచిన దొరనై యోష్మాకీనవాల్లభ్యపరిలభ్యసౌఖ్యంబుఁ జెంద నుర్వరవరనైపుణ్యంబునం బుణ్యంబుగా నెలఁతమే లెదుమే లెదుగబడనీక నొకనిమేషంబున శోభనమిషోన్మేషంబున మీనమేషంబు లెంచక జకచకితమేచకవికచకరుచినిచయంబుఁ గమిచి బ్రచురమగు శుచివిచికిలఘుమఘుమద్గంధబంధురోత్తమాంగంబుఁ దదరుణతరుణచరణనాళీకంబు సోఁక జాగిడక జాఁగి యర్ఘ్యపాద్యాదులం బూజించి వరభక్తిచే దేవరకు మత్పుత్రిక నాహూయకన్యాదానంబు నిదానంబుగా నొసంగెద నితోధికభాగ్యంబు వేఱె యే మున్నదని యాత్మావచ్ఛిన్నతావకీనావతారంబులు గణియింప నాతరంబె పాణిగ్రహణంబు నంగీకరింపవలయు భవదీయచిత్తం బెత్తెఱంగై యున్నయదియో గాని
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/236
ఈ పుట అచ్చుదిద్దబడ్డది