వ. అటుల నెంతైన సేపు నిలిచి మదిని ముదంబు గదుర నెదుట దానంత వడి యచ్చోట నున్న సవతులేని విలాసవతులగు యువతులు నిచ్చలపునిచ్చ నేమందురో మున్ను నేనోచిన ఫలం బీడేరె నిప్పట్టున నుండరా దని యొకమేరగా నాంచారున్నయెడ నచ్చెలువపై చెలు వలరు ప్రేమ నచ్చోటు కదలి చెంగట నిలిచి శాత్రవలలాటతమఃప్రభార్కప్రభావిభాసురుండైన యచ్చిలువమలఱేఁడు గమకంబుగతమకంబున నప్పుడు. 456
రూపకచిత్రసీసము
సీ. పడతుక పొక్కిలి సుడియౌననే గదా
యావర్తమాన మెం తబ్బురంబు
సకియ వట్రువగుబ్బ చక్రమౌనని గదా
యల్ల వృత్తాంత మెం తక్కజంబు
గన్నె చెక్కిలి చంద్రఖండమౌనని గదా
యీపల్కు జందమే యద్భుతంబు
జవ్వని నెమ్మేను చపలయౌననె గదా
యీ మించు వైఖరి యేమి చిత్ర
గీ. మౌర చెలి ముగ్ధ యగుట యీ యన్ను చెన్ను
మున్ను నాతోన గానక నెన్నె గాక
దీని యవయవములకు నెంతైన దెలియు
సాటి గలుగనె వలవని మాట లేల. 457
అభంగశ్లేషద్వయానుప్రాణితాభేదరూపకాలంకారము
సీ. ఈ లేమ నెఱిగొప్పు నీలాంబువాహంబె
యనఁ జెల్లునది ఘనమౌట కతన
యీపడంతుక బెళ్కుచూపు సోగ మెఱుంగు
యనఁ జెల్లు నదియు మించౌట కతన
యీ యింతి కన్బొమదోయి సింగాణి వి
ల్లనఁ జెల్లు మేలిమి యౌట కతన
యీ నాతి చక్కనిమేను బంగరుతీఁగ
యనఁ జెల్లు మేలిమి యౌట కతన
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/207
ఈ పుట అచ్చుదిద్దబడ్డది