పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/17

ఈ పుట ఆమోదించబడ్డది

XVI

నథిగమించి ... విటవిద్యకు బిరుదవేసి” జూదమునేర్చి, “తీండ్రవయసెచ్చఁ జే కత్తిగాండ్రఁ గూడి ...' చరించుచు “ఒక వెల యాలిమీఁద నిలుపోపని కూరిమి గల్గి, యుండ, ఆజవ్వనియు 'యెవ్వని నిచ్చమెచ్చకే' యితని తోడనే ‘మారక , తన చాతురి న్నిలువరమ్ముగ గూడి చెలంగె నయ్యెడన్.' అది చూచి, వేశ్యా వృత్తి కిది పనికిరాదని వేశ్య మాతయు, కుమార్తెకు హిత ముపదేశించి, దానిమనసుమార్చి నాగదత్తుని ధనమంతయు నపహరించి, వెడలఁ గొట్టించినది. ఇంటికి మరలి వచ్చిన నాగదత్తునికి మర్యాద యెక్కడిది. అందును చీదరించుకున్న వారే. తల్లికి మాత్ర మట్లుండునా ? ప్రేమతో, వచ్చినదే చాలునని, పిలుచుకొనిపోయి, సకలోపచారములు వాని భార్యచేత చేయించి, ఎంతోబుద్ది చెప్పినది. కాని ఆతఁడు చలింపలేదు, ఒక్కమాట బదులాడలేదు. తల్లి చాల దుఃఖించినది. అది చూచి తాను మారి నట్లభినయించినాడు. తల్లి ఉబ్బిపోయినది. తన సొమ్ముల నన్నిటిని కోడలికి పెట్టి శృంగారించి కుమారుని పడుక టింటికి పంపినది. పాపము, మోస పోయినది. ఆ కుమారుఁడు ఆనగల నన్నిటిని దోచుకొనిపోయి, రాత్రికి రాత్రియే, ఆ వెలయాలికి సమర్పించినాఁడు. త్వరలోనే ఆ సొమ్మంతయు ఐపోగా, వేశ్య మరల ఉద్వాసనము చెప్పగా, దారి దోపిడితనమునకు దిగి...

         ఆయన సేయనిపాతక
         మేయనువు లేకఁబురికి నెడయై జని దా
         బోయల గూడుగ దెఱువుల
         నాయకు లేతేర తాను నడుమ నడచుచున్'

........ రాజుల నగరములు జొచ్చిరాయిడి, జేయుచున్' ... 'తిరిగి తిరిగి యున్మత్తుఁడై నాగదత్తుఁడు ....... తద్బటులంతరంగంబున...... తుందుడుకు సామిసొమ్ము దోచు' టకు బొక్కసమును దోఁచగా హరిభటులుపైకొని యుద్దమాయెను. దొంగలగుంపు ఓడిపోయి స్వామిపుష్కరిణి లోబడి మరణింపగా వారికి, అందువలన, మోక్షమబ్బి దివ్యవిమానములు వచ్చి, కొనిపోగా, వారందఱు 'విధునిపదముల కరిగిరి’ అటు తర్వాతి గ్రంథమంతయు దేవతలు వేంకటేశ్వరస్వామిని స్తుతించుటతో సరిపోయినది.

ఈ విధముగా తక్కువకథతో కవి తన కావ్యమున తన పాండిత్యమును, లోక జ్ఞానమును, చిత్రకవిత్వ బంధకవిత్వాది సాముగరిడీల ప్రదర్శనమును, ఆంధ్రవాఙ్మయములోనే ఎవరును చేయని విధముగా చేసినాడు.