పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/160

ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

111


క. అరయ నపరంజి ప్రతిమకు
   మెఱుఁగిడి చొక్కమగు జాజు మెయి జరమిన యా
   యిరవున యాకాశ మహీ
   శ్వరసుత తగనెరుల చూడ్కి వహి నింపెసఁగన్. 271

సీ. సంపంగికావులు చందురుకావులు
             వెలిపట్టుజీబులు వేఁట చాళ్ళు
    బొమ్మంచు ముయ్యంచు పొప్పళి హోంబట్టు
             నుదయరాగము కందులు రత్తవన్నె
    ముత్తలపందిళ్ళు నుత్తరగోగ్రహ
             ణంబులు కరకంచు నాచువన్నె
    నిండువెన్నెలు మంచినిగమగోచరులు సా
             మంతవీథులు ప్రతిమలును బొగడ

గీ. పచ్చలును మేఘవన్నెలు పచ్చపట్టు
   గరుడపచ్చలు నేత్రముల్ తురగవళ్ళు
   హంసవళ్ళును పద్మాలు హరిణవళ్ళు
   మొదలుగా వల్వలు ధరించి ముదిత లపుడు. 272

ఉత్సాహయుక్తగీతి


   అందమైన కీలుగొప్పు లందుఁ బూలుతేనియల్
   చింతనీక యుంచి నిగ్గు చెంగళించు జాళువా
   సందిదండలుం గరాలు సన్నసన్నసరులు హొం
   నందెలుం గడెంబు లచ్చహారముల్ తురాలు క్రొం

గీ. బసిఁడి గంటల మొరనూళ్ళు బాహుపురులు
   సరిపెణలు ముత్తియంపు ముంగరలు తాళి
   పతకములు దాల్చి పన్నీట పదనుమించు
   చందన మలంది రంతట సంతసమున. 273

క. ఈరీతి వారి భూరి వి
   హారానంతరమునందు నతి చతురగతుల్
   మీఱఁ గయి జేసి మనమొక
   మేరన్ క్షణమాత్ర విశ్రమింతమె యనుచున్. 274