108
ప్రబంధరాజ వేంకటేశ్వర
ముద్రాలంకార - అపూర్వప్రయోగము
మ. వనజాతాక్షి యురోజకుంభములతో వర్తించురోమావళీ
ఘనహస్తస్థితితోఁ గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోఁగ జా
ఱిన గస్తూరి మదంబుతోఁ దళుకు మీఱెన్ హారపద్మాభతో
మన ముప్పొంగఁగ డిగ్గెఁ వత్సరసికి న్మత్తేభవిక్రీడితన్. 262
జలకేళి వృషభగతిరగడ
చలువ పలువగ మించ నంచను సరసి | సరసిజముఖులు వీడక
నలువు వలువలు గట్టిగట్టి మనంబు | నం బురికొనెడు వేడుకఁ
దరిని సరినిల నమరి మరితమ తమక | తమకము లొనర డిగ్గుచు
మెఱసి యొరసి యొకళ్ళొక ళ్ళటుమెట్టు | మెట్టుచు మిగుల మొగ్గును
ఘనత గను తమివలపు గలపము కరగ | కరగత జలము చల్లుచుఁ
దనువు లనువుగ డయ్య నొయ్యన తరగ | తరగక నిలిచి మళ్ళుచు
యెలమి బలిమిగ నీదవే దుడుకేల | కేలటు సాచకానవు
లలన యెలనగ వొమ్మరమ్మొకలాగు | లాగున నెంతదానవు
రావకా వగ ననుచు బిరాన | రానను తొడిగి గ్రమ్ముచు>
తీవరేవల ననఁగి పెనగుచు తెలివి | తెలివిరిదమ్మిరెమ్ముచు
కుసుమరసములు విసరుపస గైకోక | కోకనదంబు గాంచెను
వనము బీసములక్రేవ నావగవారి | వారిని దనుప నెంచెను
కప్పుపుప్పొడి వ్రేయ నాయమె కంట | కంటటు బెంచివేగమె
యప్పమెప్పుగ తోవకలనీ వాడ | వాడకయుండలాగమె
మరలి పొరలుచు నలికతిలకము మాయలు గొన్ని సేసెదు
తరలికెరలుచు తోవ వేనలి తరమె | తర మెఱుఁగకయు తీసెదు
వద్దు రాగతనాలు వలుకకు | వాదులాడగ తగునె వారికి
యద్దిరా దొరసాని నిటు రా | నగునె పొమ్మటు నీదువారికి
యనుచు నుండగ నేచి యొకచెలియందు | నందఱ జాచి కొందఱ
దనర నొహో రంతు సేయఁగ | తగునె యిటు నెఱబిరుదుముందఱ
యెల్లవారికి నోలపెట్టెద | నీదులాటకు బిరుదు గట్టెద
నొల్ల ననియెడివారి దిట్టెద | నొనర మన్మథు నా నీబెట్టెద
వెందుజునిగెద రంచు బెట్టుగ | నేచిచే సుమరజము నొట్టుగ