88
ప్రబంధరాజవేంకటేశ్వర
నిల్పి మీటలు తరువుల నిగుడజేసి
వట్టి మృగముల పిట్టల గొట్టియందు. 198
గీ. ఒకటి తొలుత వేఁట జిక్కిన మెకముఁ దెచ్చి
నెత్తి నీటను గడిగి చేకత్తి చేత
ముంచి కనుగ్రుడ్లు బెఱికి తన్నెంచ చెంచు
లంచ తమ్మి కంటికి నివాళించి చెలఁగె. 199
వ. అట్టిపట్టున.
చ. కని చిగిరింతయున్ గదుడు కారయు కోరిక చేరి బోడయున్
గునుకును సొంటి చిప్పరయు గొఁగడ యూదరనక్క తోఁకయున్
బొనుకెడ పీరితోణగియు పొత్తర మల్లవ మారువెల్లియున్
వెనుతరు ప్రొల్లబూదియును వీడలి పిచ్చుకబియ్య మెండ్రయున్. 200
గీ. కనుము కందురు గరిమిడి గఱికె పొలికి
తొప్పరంట్రింత సాలువ యుప్పుగడ్డి
పరిక ముల్లూచి మొదయము బైటితుంగ
మొదలుగాఁ బూరి రవలింప పొదలు వెడలు. 201
సీ. శార్దూల గజసింహ శరభసంఘంబుల
సమయించి కణతుల జక్కుసేసి
భల్లూకశల్య శంబరలు లాయంబుల
దునిమి సివంగుల దూల బొడిచి
సారంగగండకచమరీమృగంబుల
నురుమాడి కొర్ణగండుల వధించి
గవయ జంబుక ఖడ్గ గండభేరుండ ప
టలి గూల్చి మన్ను పోతులనుఁ జంపి
గీ. యేదులను నొంచి దుప్పుల నేపణంచి
శశకముల ద్రుంచి యిఱ్ఱుల సంహరించి
యితర వన్యమృగావలి నెల్ల విశిఖ
చాతురిని గెల్చి ఫణిగిరి స్వామి మఱియు. 202