పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/136

ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

87


సీ. ఏనాదిరాయ నీవీ కోనలో రమ్ము
            ముతరాచ నీవల్ల పొదను నిలుపు
    వేకరిసామి నీవీ పట్టు సూడుము
            బోయనీ వాసలచాయ కాపు
    మెఱుకులఱేఁడ నీవీనెప్పు సూడుము
            సెంచనీదౌ పొగయంచకదలు
    వేసమన్నీఁడ నీవీకాన వెరజుము
            గైతనీవా జాడ గనగ చూపు

గీ. తాచురారూపు చుట్టునేస్తంపు జియ్య
    యయిన రాససక్కరపతి యదె పిరపడి
    సూసి బందుగు లిటురాఱ్ఱ జోస్తి ననుచు
    పలికి యావల వల వేటరులను గలిసి. 193

క. వలలం గాలంబుల గొడ
    మల సూదుల జువ్వలను గ్రమంబున మడుగే
    రుల యడలవ్రేసి యెడ్డియు
    బలువిడి నూదియును దొడఁగి బారలు మీరన్. 194

ఉ. ఉల్లికతట్ట మారువము వాలుగ బేడస కొఱ్ఱమీను పెం
    జెల్లయు పక్కెపారియును నీచును ముచ్చగ బొమ్మడాయముల్
    డొల్లిక తేలుమీని సుకదొంతును పిత్తడికాసుమల్లు మీ
    నల్లెయు గండెరొయ్య పరకాదిగ చేపలఁ బట్టిబెట్టుగన్. 195

వ. అంత నయ్యెఱుకలుగల యెఱుకుఱేఁడు ప్రేమంది తనమందిని గూడి శౌరి కనుఁగొన లటహ
    పటహంబులు దిక్తటంబుల నడర చరపించి. 196

గీ. వలలు వేయించి తడికలు వంచి యడుగు
   జాడ లెత్తించి బోనలు సంఘటించి
   పోగు వారించి గసికలు పొసగనుంచి
   మినుకు లరయించి తడికలున్మాటి యచట. 197

గీ. పాదులను దీముగువ్వల పాదుకొల్పి
   జిగురు గండెలు నురులును జిప్పతుదల