పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/125

ఈ పుట ఆమోదించబడ్డది

76

ప్రబంధరాజవేంకటేశ్వర

ఉ. ఈ దివసంబునందుఁ దగనిచ్చటి కోనల యీ కిరాండ్రనం
    బేదలు మామలల్లుడులు పెద్దలు సుట్టలు నల్లిబిల్లిగాఁ
    బ్రోదిగ వేఁటలాడి కడుపు ల్దనియించుచు నిల్లుముంగిలై
    సోదెము జూచువారలకు జూపుచునుందుము నాడునాటికిన్. 157

క. సామీ సల్లనీప్రొద్దున
    నేము దలంచవలె మిమ్ము నిట జేజే రా
    గీములపట్లను బీళ్ళను
    నేమును మీసలువ వలన నెమ్మది నుందున్. 158

అపూర్వప్రయోగము


క. పులిమీసల నెపుడే ను
    య్యెల లూఁగుచు విల్లుపూని యెదటన్గిదటన్
    బలమున్ గిలము న్వెలయఁగ
    నలుగుల నెలుగులను ద్రుంతునలవోని తఱిన్. 159

సీ. గెలుపుపేరు వజీరు గినిసిన కప్పుటై
              దువరాచ సెంచు మాదొడ్డివేల్పు
     సతబాసవాల్దంట కతలాని పాఱు వే
              సముఁగొన్న బోయ మాజాతిపెద్ద
     సురఁటివీఁపుల చుట్ట దొరమొక్క రానేస్తి
              జంగిలి యెఱుక మాసంగడీఁడు
     దరమంపుటొజ్జకు తదవ్రేలొసంగిన
              యానాది మాకితవైన ఱేఁడు

గీ. వేయునేటికి తరిమల వెండికొండ
     తాలిగుబ్బలి కడగట్టు ఠావులందు
     నప్పసం బుప్పతిల్లుచు మెప్పుగన్న
     యట్టికొరవంజులెల్ల మాసుట్టలయ్య. 160

సీ. బలితంపు వణుఁకుగుబ్బలిక్రింది నాడెల్ల
                కేలిగా మాపెద్ద కైరఁడేలు