పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/124

ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

75

    బొక్కలాయపు జక్కి యెక్కటి తోడెక్కు
            తత్తడి పురిసికఁ దాల్పువేల్ప
    మబ్బు పూబుట్టువు మాళిగలోనుండు
            గుబ్బెత నెదచేర్చి యుబ్బుజేజె

గీ. సంజ జగడంబుకాక రాచాయమించు
    తలఁపు మానిక మరచేత నిలుపు రాజ
    డాలు తులకించు బేడెస టెక్కియంపు
    సాహెబును గన్న చొక్కపుఁ జక్కనయ్య. 153

అపూర్వప్రయోగము


శా. నేలన్ గూఁతలు వెట్టువాలు పులిచక్కిన్మించు పావాలు మున్
    గాలంజాలు జెలంగుడాలు మొనకెక్కన్ బక్కిరాడాలు ని
    ర్గేలన్ బేర్కొనువేల్పుచాలు నెదనెమ్మిన్నిల్వబూ చాలు నే
    వేళం బూతల మేలు మేలును గలా వెన్నుంనినుం గొల్చెదన్. 154

జాతివార్తలు


సీ. చలిగాలి దిండిమేతల జాతికొమ్మల
              యాటల కిరవైన యట్టి సెలలు
    గుఱ్ఱపు మూతుల కులము పొల్తుల తేఁట
              పాటలకునికైన మేటిచరులు
    నిసుమంతమాన్సివంగసము బాలల కిన్నె
              రల మ్రోతలకు మారువలుకు గవులు
    తెలిసుద తెరగంటి తెరగంటి తెఱవల
              రచ్చపట్టగు నెలఱాతిగములు

గీ. జంట ముక్కాలి ఱెక్కడాలంటు చేత
    మలినమౌ నలినములుండు బలుకొలఁకుల
    గలిగి చెంచులకెల్లను నిలుక డయిన
    పొన్నవలిమల చెంత మా బూమిసామి. 155

తే. అట్టి సలిమల సేరువ యడవి నున్న
    చెంచులెల్లను మాపని సేయనుండి
    కోరి దేవర యడుగులు కొలువ వేడి
    యరుగుదెంచితి దామకుఁ డండ్రు నన్ను. 156