74
ప్రబంధరాజవేంకటేశ్వర
అధికము
క. ఉల్లము పొడుపు దొరయ్యా
చల్లని నీయసము పాలసంద్రములోనన్
దొల్లిఁటి సాముల యసముల
నెల్లను బుద్బుదములట్ల నిలఁ గన్పట్టన్. 150
సమత
సీ. వితరణంబులు లేవె వివిధ పంగ్వంధ
ధ్యల కభీష్టములు సంధిలవుగాక
నుత్సవంబులు లేవె యురుహరు హరిదాగత
ప్రభుదత్త విత్త మేర్పడదుగాక
గిరిదుర్గములు లేవె పరమోత్తమ సమస్త
తీర్థరాజాప్తి వర్తిలదుగాక
నెఱతనంబులు లేవె నిరుపమ పారసీ
కచ్ఛేదనోద్వృత్తిఁ గనదుగాక
గీ. ధరణి పుణ్యస్థలముల దేవరలు లేరె
నీవలెను దివ్యతిరుపతి నిలిచి భక్త
వారములఁ బ్రోచు సాములు లేరుగాక
పంకజాతాప్త నీకాశ వేంకటేశ. 151
శయ్య
క. వలరాజఁట కొమరుఁడు చి
ల్వలరాజఁట పాన్పు ముద్దులమఱఁది చెంగ
ల్వలరాజఁట కావుననే
వలరాజని నిన్నుఁ బొగడ వసమే సామీ. 152
అపూర్వప్రయోగము - తెనుఁగు మఱుఁగు
సీ. పయ్యరమేపరి నెయ్యఁపు బోనంపు
తెలిమెకం బెకిగింత గలుగు సామి
రెంటత్రాగుడు చట్ట రెట్టింపు తాలుపు
తలపువ్వు తండ్రిలో నిలుచు జియ్య.