విజయవిలాసము
57
సీ. వడిగకర్లమునకు వచ్చి చక్కఁగ కాళ్ళు
వెనుకకు నిగుడింప వెంబడిగను
మోకాళ్ళు వంచి తెప్పున బొటవ్రేళ్ళచే
తిరుకాశ డూర్చి యెత్తి పొరలించి
సరసుక యోర రాఁ బరిబడి పొరలించి
యొకకేలఁ గుత్తుక నొడిసిపట్టి
ముడిగి గడ్డముక్రింద ముడ్డి యాడించి యం
కిణి గొట్టి సీసాన కిలిసి నిలువఁ
గీ. జంకలను చేతు లునిచి పై చక్కి నెత్తి
తలకు సందిలి తప్పించి తొలఁగిలేచి
వివసమాయించఁ జూచి యావీణ జెట్ల
కెలమి బిరుదులొసంగి వీడ్కొలిపి యంత. 88
క. బిరుదుగల తులువ లిరువురు
నెఱమట్టి మెఱుంగు దట్టు లెగచల్లడముల్
బరగంగ బొందెకోలల
హరిగలు తాటించి మ్రొక్కొయారము మీఱన్. 89
క. పొదలుచు నొండొరు చలమునఁ
బెదమీసల దీటుకొనుచుఁ బెట్లాటకు బె
ట్టిదమగు గేకలు వ్రేయుచు
కదియుటకై దండబూని కలనిల్చి తమిన్. 90
ఉ. పెట్టినదండ దియ్యకొక పెట్టునఁ బై బడనియ్య కోరఁగా
గట్టిగ బట్టినట్టి హరిగల్ వెలిలోనుగ ద్రిప్పి యొడ్డి కేల్
బొట్టిలకోలలన్ మొనలు బోరకు ఱొమ్మునకున్ మొగానకున్
బిట్టుగఁ దాఁకఁగా బొడిచి పేరమ వారుచు హెచ్చరింపుచున్. 91
ఉ. గిబ్బ లెదిర్చి కొమ్ముల ఢకీలుఢకీలునఁ గ్రుమ్ములాడు దా
రబ్బికయైన చిత్తరులహత్తి బెనంగుచు బొందెకోల బల్
దెబ్బలు ఖేటకోపరి తతిన్ గళిపెళ్ళుగధాఁరఁ బోరిపె
ల్లుబ్బుచు వింగళించి తగనుద్దిగ నిల్వ బహూకరింపుచున్. 92