54
ప్రబంధరాజవేంకటేశ్వర
నుంబోని వారాంగనల కటాక్షమార్గంబపేక్షించు బిరుదు కెంచపుమాష్టిలచాలును, మఱియు నొక్క చొప్పున నుప్పరిగల ముంగని చప్పరంబుల మధ్యరంగంబున నొప్పులకుప్పలై ముత్యపుఁజిప్పల చొప్పున విప్పులగు కనురెప్పల కప్పు దప్పనరికి బవరి తరితీపు చూపు చూపు తీరువుల తదీయముఖ పంకరుహ భ్రమద్భ్రమర విభ్రమంబు పుట్టించు ప్రతిభవనభూపాలాకావరోధ కన్యకల కరాంచల హేమపాత్రికల దేజరిల్లు కర్పూరనీరాజనంబులవలనను, నేత్రోత్సవంబై వెలయు వలయు వైఖరీ మండలాకారంబుగాఁ జుట్టును దిరుగు వీణావేణు శంఖకావాళ పటహ ఘనఢక్కా పటహ డమరు డిండిమ నిస్సాణ జర్ఝరీభేరీ మర్దళ మురజ తుత్తుంబికాది బహువిధ నిరవద్య వాద్యనిర్ఘోషంబును, శశిముఖీశయకు శేశయాధిష్ఠిత శాతకుంభకుంభ ప్రదీప్తదీపంబును ఆరాత్రిక పాత్రధారిణి పరంపరామంజుమంజీర సంజాత సింజానుపుంజరంజిత మణిమేఖలా ఝణఝణత్కారంబునునై జూపట్టు తటిత్తు వేడుకల గైకొని గోవిందలిడుచు యెద్దులపై తమ్మటమ్ములు తిడిమి తిడిమని మ్రోయవేయుచు వచ్చు రోణంగి దాసరుల గంతులుగని నిజదివ్య త్రిభువనావన భవనాం గణంబున వేంచేసి తదనంతరంబున. 78
సీ. అలమేలుమంగా మనోబ్జ భృంగపరాకు
యహ రహర్దానవ హరపరాకు
శ్రీ తిరుపతి మహాసింహాసన పరాకు
దివిజాధినాథ వైభవ పరాకు
సకల భక్తజన రక్షణ విచక్షణ పరాకు
జరవందిత పదాంబుజ పరాకు
కమనీయ సందీప్త గరుడవాహ పరాకు
శతకోటి మన్మథాకృతి పరాకు
గీ. దేవర పరాకు తిరుమలాధిప పరాకు
మాయురే! స్వామి చాఁగు భళా యటంచు
మాగధులు చేరి సముఖంబు వేగవిప్ప
నలువుమీఱంగ నిజవాహనంబు డిగ్గి 79