శ్రీ దేవీ భాగవతము
ప్రథమ స్కంధము
శ్లో|| సర్వ చైతన్య రూపాన్తాం మాద్యాం విద్యాఇ్చ ధీమహీ
బుద్ధిం యానః ప్రచోదయాత్ ||
క. శ్రీద శ్రీద సముజ్జ్వల | పాద మహోత్పల మరందపాన మనీషా |
మేదుర నతజనపుణ్య | చ్ఛేదిత కిలికలుషపాశ శ్రీ సోమేశా ||
వ. అవధరింపుము. నిఖిలపురాణ సమాధ్యాన విఖ్యాతుం డగు సూతుం గాంచి విజ్ఞాన విలసిత
సదమలచిత్తముకురఫలదుండగు శౌనకుం డిట్లనియె | ౧
సీ. సూత మహాభాగ సుగుణ శుద్ధచరిత్ర భూతదయాపర పురుషవర్య
ధన్యుండ వాగమ తత్వైకవేదివి నిష్కిల్బిషుండవు నిర్మలుండవు
వ్యాసునిచేఁ జెప్పుఁ బడిన యష్టాదశ సత్పురాణంబులు చదివినాడ
వవి పంచలక్షణాధ్యంచితంబులుఁగావె యభ్యసించితి వీవు వ్యాసు వలన
గీ. మేము పూర్వభవంబుల నోమనట్టి | నోముల ఫలంబుగాఁగ దీనులము మము
సుకృతులనుఁజేయ దివ్యవిరుద్ధపాప | రహిత మీ క్షేత్రమునకు నీరాక యొప్పె || ౨
క. ఓ పుణ్యచరిత సంసృతి | తాపరహిత బ్రహ్మసమ్మితమగు పురాణం
బోపికఁ దెల్పవె విన ని | చ్చాపరతం జిక్కె మౌనిసంఘం బిచటన్ || ౩
తే.గీ. యమికులోత్తమ శ్రోత్రేంద్రియములుఁగల్గి సత్పురాణార్థములు వినఁజాలకుండ్రు
నరులఁ గొందఱు బుద్దిహీనతన కాదె | వారు విధిచేత పంచింపఁ బడినవారు ౪
తే.గీ. షడ్రసంబులచే జిహ్వ సాధుజనుల | పచనములచేతఁ జెవి సుఖవశతఁ టొనరు
శ్రవణరహిత సర్పము పోలు శబ్దయుక్తి ! | జేరి వినరాని మనుజుల చెవులు చెవులె.౫
ఉ. నైైమిశ కాననాంతరమునం గలిభీతిఁ దపించు సంయమి
స్తోమము తావకీయ మృదుసూక్తి సుధారసధార లాన నెం
తే మతిపూనె నిజ్జగతి నెడ్డెలు దుర్వ్యసనాత్ములై దిన
గ్రామముఁ బుత్తు రార్యులు దిరంబుగ నుందురు శాస్త్రచింతనన్ ॥ ౬