23
తే.గీ. రెండువందల వర్షముల్ - నిండె నేటి ! కతని విద్యావినోదంబు • లవనియందు
భూపతివ్రాతములచేతఁ • బూజ్యమాన | మగుచు వర్తిల్లిన దినంబు • లవనియందు
శ్రీ హరీతగోత్ర సంభూత
-: కురుగంటి వేంకటరామగొని ప్రభావము. :-
సీ. శాలివాహనశక , సంవత్సరంబులు | పదియేడువందల , పైన నొక్క
వర్షంబునను గోన వారిపాలెమున నెల్లూరు సీమసు సదాచార వృత్తి
చణుఁడు రామస్వామి శాస్త్రి, యజుర్వేది | సుమహితాపస్తంబ సూత్రయుతుఁడు
కలఁడు శాయమసాధ్వి • లలితాంగీ తను గొల్వ | నన్న దానవరత్వ మమర నకవితని
తే.గీ. కొమరుఁడై పుట్టె దొంటి గౌతముఁడు తక్క | శాస్త్రకుత్సితహేతుపక్ష ప్రమాద
రాజిఁ దొలఁగింప వేంకట రామశాస్త్రి | వినుత దుర్హేతువాదవిభేద శస్త్రి |
తే.గీ. అతఁడు హారీతకులజాతుఁ - డసుగమాఢ్య • మైన క్రోడంబు రచియించి • యధిక కీర్తి
బడసె దిగ్విజయముఁ గాంచెఁ • బరులు సాటి రారు కురుగంటి వేంకట రామమణికి ||
తే.గీ. కాశి గద్వాల పునహానగర జయపుర | నాగపుర కాళీఘట్ట తం - జాపుర మిధి
లాపురానంతశయన కొల్లాపుర మహి | శూర పురములఁ గురుగంటి సూరి గెలిచె ||
క. అనుగమ భట్టాచార్యుం : డని కొందరు తర్క, సింహ మని కొందరునుం
గని యపరగౌతముండని : యును గొందరు పిల్చి రతని • నుర్వీస్థలిపై |
క. పడుచుఁదనముననె తనయున్ విడచెను దాఁ బ్రొద్దువాక • వీటను బాలున్
విడిదిగను గైకలూరుం బడసెను దా నంద యుండె • బహువర్షంబుల్.
క. కొల్లేటి యొడ్డునం గల | ఝల్లీలోఁ గైకలూరు • చక్కని యూ ర్మా
యల్లూరికి గ్రోశతయి | సుల్లసిలుం బ్రొద్దువాక • యొక క్రోసు సుడీ ||
కృతికర్త నిజవంశ వర్ణనము.
-: శ్రీ మదాది వరాహస్తుతి. :-
శా. శ్రీవాల్లభ్యము కొల్లపెట్టెడి నుర స్సీమం బ్రవేశించి యం
చా విశ్వంభర చిన్న బోవు నని తుల్య ప్రేమ సూపన్ వరా
హావిర్భావము పూని దంష్ట్రశిఖ నొయ్యం దాల్చి యున్నట్టి య
ద్దేవుం డీవుత భోగభాగ్యశుభసిద్ది న్మాకు నశ్రాంతమున్