పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

17

దీనికొక వింతయేమి ! వ్యాసుండు తానే దేవతనుగూర్చి యేకథ సెప్పునో ఆ కథకును, ఆ దేవతకును బ్రాధాన్యమిచ్చినది యెవ్వరికి దెలియదు? అంతమాత్రముచే నం దొకటి ముఖ్యమనియు, మరియొకటి యముఖ్యమనియుం జెప్పుట యుచితమా? 'సోర్ధ్వపుండ్రముఖం దృష్ట్వా వ్రతం చాంద్రాయణం చరేత్ ' అని చెప్పినచోటనే “తిర్యక్పుండ్రధరం దృష్వా | చండాల మివ సంత్యజేత్" అని చెప్పలేదా? కావున నుభయపురాణములును ముఖ్యములే అని మనము గ్రహించుట యుచితము కానున్నది. రెండిటికి లఘుత్వము చెప్పినను చెప్పవలసి పచ్చును.

ఇంతకును వారి వారి భక్త్యతిశయముల ననుసరించి భాగవతపురాణములు రెండింటిలో నొకదానిని వారు వారు పురాణమని యనుకొందురేకాని, నా తాత్పర్యమందు రెండు భాగవతములును పురాణములనియు, వ్యాసప్రోక్తములనియు, పఠనీయములనియు నమ్ముచున్నాఁడను.

మహాయనియు, ఉపయనియు భేదములు కల్పించుకొని ముఖ్యత్వాముఖ్యత్వములను జెప్పుట యుక్తముకాదని తలంచెదను.

ఇట్లు

దాసు శ్రీరాములు,