పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

16

కూర్మపురాణము - మహాపురాణములలో “భాగవతమే "అని చెప్పి, పిమ్మట ఉపపురాణములలో “పరాశరోక్తం ప్రవరమ్ తథా భాగవతాహ్వయమ్" అని చెప్పినాడు గాని ఇందువలన ఏది మహాపురాణమో, ఏది యుపపురాణమో తెలియదు.

గారుడపురాణమునఁ దత్వరహస్యమున ప్రథమమున మహాపురాణములలో విష్ణుభాగవతమును చెప్పి, పిదప లఘుపురాణములలో, సాత్వికములలో", "తంత్రం భాగవతమ్ .. " అని దేవీభాగవతము బరిగణింపబడినది.

పాద్మపురాణము - శకునపరీక్షయందు మహాపురాణ పఠనానంతరమునందు " శైవమాది పురాణంచ దేవీభాగవతం తథా" అని యుపపురాణముల లో దేవీభాగవతము పరిగణింపఁబడినది.

శైవపురాణము - ఉత్తర ఖండము - "యత్ర వక్తా స్వయం తంత్రే | బ్రహ్మా సాక్షా చ్చతుర్ముఖః | తస్మా ద్బ్రాహ్మ్యం సమాఖ్యాతమ్ | పురాణం ప్రథమం మునే || పద్మకల్పస్య మహాత్మ్యం | తత్ర యస్మా దుదాహృతం , తస్మాత్పాద్మమ్ సమాఖ్యాతమ్ | పురాణం చ ద్వితీయకమ్ | పరాశరకృతం యతు | పురాణం విష్ణుబోధకమ్ | తదేవ వ్యాసకథితమ్ |పుత్ర పిత్రారభేదతః || యత్ర పూర్వోత్తరేఖండే |శివ స్య చరితం బహు | శైవ మేతర్పురాణం హి | పురాణజ్ఞా నుదంతి చ || భగవత్యాశ్చ దుర్గాయా | శ్చ రితం యత్ర విద్యతే తత్తు భాగవతమ ప్రోక్తమ్" ఇట్లని దేవీభాగవతము మహాపురాణములలో బరిణింపబడినది.

కాళీపురాణము - "య దిదం కాళికాఖ్యం త | న్మూలం భాగవతం స్మృతం" ఇందువలనఁగూడను దేవీభాగవతము మహాపురాణముగా గణింపఁబడినది.

ఆదిత్య పురాణము - "యా .. మహిషందైత్యం - .. వృత్రాసురం తథా ॥ సాద్య ...... హత్వా | స్వా .......... ప్రదాస్యతి " దీనివలన మహాపురాణత్వము దేవీభాగవతమునకే యీబడినది.

బ్రహ్మవైవర్తము - హయగ్రీవ బ్రహ్మ విద్యా | యత్ర వృత్రవ ధస్తథా | గాయత్య్రా చ సమారంభ | స్తద్వై భాగవతం విదుః దీనిచే దేవీభాగవతమే మహాపురాణమని యెన్నంబడి యున్నది.

ఈ విధమున నొక పురాణమునందు నొకదానికి బ్రాధాన్యమిచ్చి మరియొక పురాణము నందు మరియొక పురాణమునకు బ్రాధాన్యమీబడినట్లు గానవచ్చుచున్నది.