పుట:శ్రీసూర్య శతకము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదములు

  1. ధోరము - ప్రా. తెలుగుతోరము - శ్రీరామకవిగారు ప్రాకృత పదమునే వాడినారు. 'కంకణధోరము గట్టి' 47 ప
  2. జలిది – జల్దీ - అన్యదేశ్యము - త్వరగా "ఛలో ఛలో జలిది" 61 ప.
  3. సుధాభుక్కులు - సుధా భుక్కులు - అని ప్రాస. పదస్వరూప నిర్ధారణ. 64 ప.
  4. ప్రప్రీతుఁడు - ఉపసర్గ సంవిధానము - ఉపసర్గ సంవిధానము శ్రీనాథునికి మాత్రమే గలదు. తిరిగి శ్రీరామకవిగారికి మాత్రమే గలదు. అందువలననే చెళ్ళపిళ్ళవారు శ్రీరామకవిగారిని "ఆపర శ్రీనాథుడు" అని ప్రశంసించినారు.

మూలము - వివరణ

సంస్కృత సూర్యశతకమున నూఱు శ్లోకములు గలవు. అవి అన్నియు స్రగ్ధరావృత్తములు.

ఈ శతకమున: కిరణవర్ణనము 43, ఆశ్వవర్ణనము 6. అనూరు వర్ణనము 12, రథవర్ణనము 11, మండలవర్ణనము 8, సూర్యవర్జనము 20 శ్లోకములు గలవు.

ఈ స్రగ్ధరావృత్తము లన్నియు, ఆశీస్సు అంతముగా గలవి. అనగా ప్రతి శ్లోకమును మీకు శ్రేయము ప్రసాదించుగాత! అన్న ఆశీస్సుతో ముగియును. ఇందువలన తెలుగుపద్యములును ఆశీస్సులతో నుండును.

ఇంకను చెప్పవలసిన వనేకము లున్నను గ్రంథవిస్తరభీతిని విరమించితిని.

శ్రీరామకవిగారి సూర్యశతకానువాదము తెలుగు సీమలో వ్యాప్తిని బడయు గాక!

- నిడుదవోలు వేంకటరావు -